Review Meet: అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్: సీఎం జగన్
ABN , First Publish Date - 2022-08-12T22:43:09+05:30 IST
Amaravathi: సీఎం జగన్ (CM Jagan) క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష సమావేశం (Review meeting) నిర్వహించారు. పాఠ్యపుస్తకాల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం

Amaravathi: సీఎం జగన్ (CM Jagan) క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష సమావేశం (Review meeting) నిర్వహించారు. పాఠ్యపుస్తకాల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తూ.. దశలవారీగా డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. భద్రత, ఆరోగ్యం తదితర అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించాలని, విద్యార్థినుల సమస్యలపై మహిళా టీచర్ ద్వారా కౌన్సెలింగ్ (Counselling) ఇప్పించాలని ఆదేశించారు. స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు.