వరద బాధితులకు తక్షణ సాయం ప్రకటించాలి: శైలజానాథ్

ABN , First Publish Date - 2022-07-19T00:28:56+05:30 IST

అమరావతి: వరద బాధితులకు రూ.25వేలు తక్షణ సాయం ప్రకటించాలని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ డిమాండ్ చేశారు. అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు

వరద బాధితులకు తక్షణ సాయం ప్రకటించాలి: శైలజానాథ్

అమరావతి: వరద బాధితులకు రూ.25వేలు తక్షణ సాయం ప్రకటించాలని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ డిమాండ్ చేశారు. అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయని, జలదిగ్బంధంలో చిక్కుకున్న గ్రామాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు  పర్యటించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. వెంటనే వరద నష్టాన్ని అంచనా వేయాలని కోరారు. జాతీయ విపత్తుగా ప్రకటించేలా కేంద్రంపై రాష్ట్రం ప్రభుత్వం ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.  

Read more