హోంగార్డుల సేవలు మరువలేనివి

ABN , First Publish Date - 2022-12-07T00:59:24+05:30 IST

పోలీసు శాఖలో హోంగార్డుల సేవ లుమరువలేనివి అని ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ తెలిపారు.

హోంగార్డుల సేవలు మరువలేనివి
పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్లో హోంగార్డుల కవాతు పరిశీలిస్తున్న ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌

హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవంలో ఎస్పీ హఫీజ్‌

గుంటూరు, డిసెంబరు 6: పోలీసు శాఖలో హోంగార్డుల సేవ లుమరువలేనివి అని ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ తెలిపారు. పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో మంగళవారం హోంగార్డుల 60వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. గౌరవ వందనం స్వీకరించిన ఎస్పీ ఆ తర్వాత పెరేడ్‌ కమాండర్‌ సంధానితో కలిసి హోంగార్డ్స్‌ ప్లటూన్స్‌ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో హోంగార్డుల సహకారం అభినందనీయమన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, బందోబస్తు, నేర నియంత్రణ, టెక్నికల్‌ విభాగాల్లో, ట్రాఫిక్‌ నియంత్రణలో కానిస్టేబుల్స్‌తో పాటుగా సమానంగా కష్టపడుతూ వారు విధులు నిర్వహిస్తున్నారన్నారు. జిల్లాలో హోంగార్డ్స్‌కు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సమాజసేవలో పోలీసులతోపాటు హోంగార్డులు నీతి, నిజాయితీ, అంకితభావంతో అహర్నిశలు పనిచేస్తున్నారని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్‌లో మెరుగ్గా పని చేయాలన్నారు. అనంతరం ఎస్పీ పెరేడ్‌ గ్రౌండ్‌ నుంచి హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో క్రైౖమ్‌ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, ఏఆర్‌ అదనపు ఎస్పీ కే కోటేశ్వరరావు, ఏఆర్‌ డీఎస్పీ చంద్రశేఖర్‌రావు, శ్రీనివాసరావు, ఆర్‌ఐలు రాజారావు, రాఘవయ్య, ధామస్‌రెడ్డి, ప్రేమ కుమార్‌, రమేష్‌ కృష్ణన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:59:27+05:30 IST