వైద్య సేవలకు.. తిలోదకాలు

ABN , First Publish Date - 2022-09-19T06:07:15+05:30 IST

పేదలకు వైద్య సేవలు సమ గ్రంగా అందాలి.. మరిన్ని సౌకర్యాలను అందుబాటులోకి తేవాలి. అందుకోసం అధికారులు ప్రత్యేకంగా కృషి చేయాలి.

వైద్య సేవలకు.. తిలోదకాలు
కలెక్టర్‌ క్యాంపు కార్యాయం కోసం తీసుకున్న నిర్మాణంలో ఉన్న వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనం

పేదల ఆరోగ్యంపై యంత్రాంగం వివక్ష

జిల్లా కార్యాలయాలకు వైద్యశాలల భవనాలు

బాలస్వాస్థ్య భవనం, వైఎస్‌ఆర్‌ క్లీనిక్‌ స్వాధీనం

ఆ స్థానంలో ప్రత్యామ్నాయ భవనాలను చూపని వైనం

 

 

నరసరావుపేట, సెప్టెంబరు 18: పేదలకు వైద్య సేవలు సమ గ్రంగా అందాలి.. మరిన్ని సౌకర్యాలను అందుబాటులోకి తేవాలి. అందుకోసం అధికారులు ప్రత్యేకంగా కృషి చేయాలి. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వాటిని గుర్తించి పరిష్కరించాలి. అయితే జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందిన నరసరావుపేటలో మా త్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహారం సాగుతోంది. అర కొరగా.. అంతంత మాత్రంగా పేదలకు పల్నాడు జిల్లాలో వైద్య సేవలు అందుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుని పేదలకు ఆరోగ్య సేవలు దరి చేరేలా గత కొంతకాలంగా ఆస్పత్రులు నిర్మాణాలు జరుగుతు న్నాయి. ఇక పేదల ఆరోగ్యానికి ఢోకా లేదనుకుంటున్న తరుణం లో జిల్లా అధికారుల కన్ను వీటిపై పడింది. జిల్లా కార్యాలయా లకు అవసరమైన భవనాలకు ఆయా ఆస్పత్రి భవనాలను కేటా యించారు. ఈ కారణంగా పేదల వైద్య సేవలకు భంగకరమన్న విమర్శలు వస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. ఎస్పీ కార్యాలయం కోసం గతంలో బాలస్వాస్థ్య భవనాన్ని బలవంతం గా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా  ప్రస్తు తం నిర్మాణంలో ఉన్న వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనాన్ని కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయం కోసం స్వాధీనం చేసుకున్నారు. కార్యాల యాలకు భవనాలను తీసుకోవచ్చు.. కానీ పేదల వైద్యానికి సం బంధించిన భవనాలను తీసుకుండటాన్ని ఎవరూ సహించడం లేదు.  ఆయా ఆరోగ్య కేంద్రాలకు ఇప్పటి వరకు కూడా ప్రత్యా న్మాయంపై అధికారులు దృష్టిసారించక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్య కార్యాలయాలకు భవనాల కేటా యింపులో భాగంగా వైద్య సేవల కోసం నిర్మించిన భవనాలను తీసుకోవడంపై పేదల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. 


బాలస్వాస్థ్య భవనంలో ఎస్పీ కార్యాలయం

నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కింద రాష్ట్రీయ బాలస్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా నరసరావుపేటకు భవనాన్ని మంజూరు చేశారు. దీని నిర్మాణానికి రూ.83 లక్షలను కేటాయించింది. ఈ నిధులతో భవనాన్ని నిర్మించారు. పిల్లల్లో చిన్నతనంలోనే ఆరోగ్య సమస్యలను గుర్తించి చికిత్స అందిస్తే పెద్దయ్యాక వారిలో దుష్ప్రభవాలు కనిపించవనే లక్ష్యంతో బాలస్వాస్థ్య కార్యక్రమం భవనాన్ని నిర్మించింది.   ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో స్ర్కీనిం గ్‌ పరీక్షలు నిర్వహించి లోపాలు ఉన్న విద్యార్థులను బాల స్వాస్థ్య కేంద్రంలో చికిత్స అందించాలే ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కేంద్రం వల్ల జిల్లాలోని పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ కేంద్రంలో సేవలు అందిం చేందుకు వైద్యులు, ఇతర సిబ్బంది 50 మందిని కూడా కేటా యించారు. ఇంతటి  ఉపయోగకరమైన కేంద్రం ప్రాఽధాన్యాన్ని గుర్తించిన అధికారులు ఈ భవనాన్ని ఎస్పీ కార్యాలయానికి కేటాయించారు. ఎస్పీ కార్యాలయం ఏ భవనంలోనైనా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నా రాష్ట్రీయ బాలస్వాస్థ్య కేంద్రం ఏర్పా టుకు అనుకూలంగా నిర్మించిన భవనం స్వాధీనం చేసుకోవ డంపై అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. బాలస్వాస్థ్య కార్యక్రమానికి ప్రత్యామ్నాయంగా భవనం కేటాయించక పోవడంతో జిల్లా ఈ కేంద్రాన్ని కోల్పోవాల్సివచ్చింది.  


వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌లో కలెక్టర్‌ క్యాంపు

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పెద్దచెరువులో అగ్నిమాపక కేంద్ర పక్కన వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 80 లక్షలతో పురపాలక సంఘం దీనిని నిర్మిస్తుండగా ఇప్పటికే రూ.30 లక్షలు వెచ్చించారు. శ్లాబ్‌ స్థాయి వరకు భవన నిర్మాణ పనులు జరిగాయి. దీనికి సమీపంలోని శివ అతిఽథి గృహాన్ని కలెక్టర్‌ నివాసానికి కేటాయించారు. ఇటీ వల కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం కోసం గాలింపులో భాగంగా  హెల్త్‌క్లినిక్‌ కోసం నిర్మిస్తున్న భవనంపై అధికారులు దృష్టి పడింది.   ఇక్కడ హెల్త్‌ క్లినిక్‌ అందుబాటులోకి వస్తే పెద చెరువు ప్రాంతంలో అధిక శాతం మంది ఉన్న పేదలకు ఎంతో సౌలభ్యంగా ఉండేది. అయితే దీని గురించి పట్టించుకోని అధి కారులు దీనిని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం కోసం తీసుకున్నారు. ఈ చర్యలతో పేదల వైద్య సేవలకు అధికారులు తిలోదకాలు ఇస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ భవన నిర్మాణానికి వెచ్చించిన రూ.30 లక్షలు చెల్లించి, ప్రత్యామ్నా యంగా స్థలం కేటాయించే విధంగా కలెక్టర్‌ అంగీకరించారని మున్సిపల్‌ అధికారులు తెలిపారు. అయితే ఇంతవరకు నిధులు, స్థలం చూపలేదు. పేదలకు అందుబాటులో ఉండేలా పెద్ద చెరువు ప్రాంతంలోనే హెల్త్‌ క్లినిక్‌ను నిర్మించాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు. 

Read more