గ్రూప్‌-1 స్ర్కీనింగ్‌ టెస్ట్‌కు హాల్‌టికెట్లు

ABN , First Publish Date - 2022-12-30T02:53:49+05:30 IST

గ్రూప్‌-1 సర్వీసెస్‌ (జనరల్‌/ లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌) స్ర్కీనింగ్‌ టెస్ట్‌ రాయనున్న అభ్యర్థుల హాల్‌ టికెట్లు ఈనెల 31వ తేదీ నుంచి ఏపీపీఎస్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఏపీపీఎ్‌ససీ సెక్రటరీ హెచ్‌.

గ్రూప్‌-1 స్ర్కీనింగ్‌ టెస్ట్‌కు హాల్‌టికెట్లు

అమరావతి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : గ్రూప్‌-1 సర్వీసెస్‌ (జనరల్‌/ లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌) స్ర్కీనింగ్‌ టెస్ట్‌ రాయనున్న అభ్యర్థుల హాల్‌ టికెట్లు ఈనెల 31వ తేదీ నుంచి ఏపీపీఎస్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఏపీపీఎ్‌ససీ సెక్రటరీ హెచ్‌.అరుణ్‌కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 8వ తేదీ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పేపర్‌-1, అదేరోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పేపర్‌-2 పరీక్షలు మొత్తం 18 జిల్లాల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. జిల్లాల వారీగా పరీక్ష కేంద్రాల జాబితాను కూడా కమిషన్‌ వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు పేర్కొన్నారు.

ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్‌కు అంతరాయం

సాంకేతిక కారణాల దృష్ట్యా ఇంటర్‌ వెబ్‌సైట్‌ శుక్రవారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు పనిచేయదని ఇంటర్‌ విద్యామండలి ఒక ప్రకటనలో తెలిపింది. అఫిలియేషన్‌, పరీక్ష ఫీజుల చెల్లింపుల సేవలు వెబ్‌సైట్‌ పునరుద్ధరణ తర్వాత యథావిధిగా అందుబాటులో ఉంటాయని తెలిపింది.

Updated Date - 2022-12-30T02:53:49+05:30 IST

Read more