విద్యుదాఘాతంతో యువకుడి మృతి

ABN , First Publish Date - 2022-10-12T06:06:12+05:30 IST

ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతిచెందిన ఘటన మంగళవారం మండలంలోని చర్లగుడిపాడులో చోటుచేసుకుంది.

విద్యుదాఘాతంతో యువకుడి మృతి
రమేష్‌ మృతదేహం

గురజాలటౌన్‌, అక్టోబరు 11: ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతిచెందిన ఘటన మంగళవారం మండలంలోని చర్లగుడిపాడులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓబూరి రమేష్‌ (24) తన ఇంటి పైకప్పు మరమ్మతులు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇంటి పక్కన ఉన్న 11కేవీ విద్యుత్‌ వైరు  తగలడంతో ఇంటి పై నుంచి కిందపడిపోయాడు. గమనించిన కుటుంబసభ్యులు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు. దీనిపై పోలీస్‌స్టేషన్లో ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదు. 

Read more