గుంటూరులో వ్యక్తి దారుణ హత్య

ABN , First Publish Date - 2022-02-16T14:49:22+05:30 IST

జిల్లాలోని నాదెండ్ల మండలం గణపవరం డొంక వద్ద పి.కిల్లయ్య(39)అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

గుంటూరులో వ్యక్తి దారుణ హత్య

గుంటూరు: జిల్లాలోని నాదెండ్ల మండలం గణపవరం డొంక వద్ద పి.కిల్లయ్య(39) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కిల్లయ్యను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. మృతుడు చిలకలూరిపేట డైకెమెన్ కాలనీ వాసిగా గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-02-16T14:49:22+05:30 IST