సాక్షి దినపత్రికకు ప్రభుత్వం సేల్స్ ప్రమోషన్ - వలంటీర్లంతా కొనాలని ఆదేశాలు

ABN , First Publish Date - 2022-07-26T13:43:33+05:30 IST

అమరావతి: సాక్షి దినపత్రిక సర్క్యులేషన్ పెంచుకునేందుకు వైసీపీ సర్కారు మరో ఎత్తుగడ వేసింది. విస్తృత సర్క్యులేషన్ ఉండి, ప్రభుత్వ పథకాల సమాచారం ఇచ్చే సాక్షి న్యూస్ పేపర్

సాక్షి దినపత్రికకు ప్రభుత్వం సేల్స్ ప్రమోషన్  - వలంటీర్లంతా కొనాలని ఆదేశాలు

అమరావతి: సాక్షి దినపత్రిక (Sakshi News Paper) సర్క్యులేషన్ పెంచుకునేందుకు వైసీపీ సర్కారు (AP Govt) మరో ఎత్తుగడ వేసింది. విస్తృత సర్క్యులేషన్ ఉండి, ప్రభుత్వ పథకాల సమాచారం ఇచ్చే సాక్షి న్యూస్ పేపర్ కొనాలని వలంటీర్లకు (Volunteers) పరోక్షంగా జీవో జారీ చేశారు. రాష్ట్రంలో రెండు లక్షల 60 వేల మంది వలంటీర్లు ఉన్నారు. పేపర్ కొనేందుకు ఒక్కో వలంటీరుకు రూ. 200 మంజూరు చేశారు. అడిషనల్ ఫైనాన్షియల్ సపోర్ట్ పేరుతో వలంటీర్ల పేస్లిప్‌లో రూ. 5 వేలకు అదనంగా ఈ  రూ.200 అలాట్ చేశారు. ఏజెంట్ ఇచ్చిన పేపరు బిల్లును యాప్‌లో అప్లోడ్ చేయాలని వలంటీర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఏజెంట్లు వలంటీర్ల ఇళ్లకు దినపత్రికను చేరవేస్తున్నారు. తమను అడక్కుండా దినపత్రిక ఎలా వేస్తారని కొందరు వలంటీర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

Read more