జీజీహెచ్‌లో మళ్లీ డాక్టర్‌ గోఖలే సేవలు

ABN , First Publish Date - 2022-12-16T01:03:12+05:30 IST

గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో గతంలో ఎంతో విజయవంతంగా గుండె మార్పిడిలు, శస్త్ర చికిత్సలు నిర్వహించిన డాక్టర్‌ గోపాలకృష్ణ గోఖలే బృందం తిరిగి ఆ సేవలు కొనసాగించేందుకు సుముఖత చూపడం, ప్రభుత్వం ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సూచించడంతో గురువారం డాక్టర్‌ గోపాలకృష్ణ గోఖలే జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభావతితో చర్చలు జరిపారు.

జీజీహెచ్‌లో మళ్లీ  డాక్టర్‌ గోఖలే సేవలు
సూపరింటెండెంట్‌తో చర్చలు జరుపుతున్న డాక్టర్‌ గోపాలకృష్ణ గోఖలే

గుంటూరు(సంగడిగుంట) డిసెంబరు 15: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో గతంలో ఎంతో విజయవంతంగా గుండె మార్పిడిలు, శస్త్ర చికిత్సలు నిర్వహించిన డాక్టర్‌ గోపాలకృష్ణ గోఖలే బృందం తిరిగి ఆ సేవలు కొనసాగించేందుకు సుముఖత చూపడం, ప్రభుత్వం ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సూచించడంతో గురువారం డాక్టర్‌ గోపాలకృష్ణ గోఖలే జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభావతితో చర్చలు జరిపారు. వార్డును సందర్శించి కావలసిన సౌకర్యాలను వివరించారు. వీలైనంత త్వరలోనే శస్త్ర చికిత్సలు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా డాక్టర్‌ ప్రభావతి తెలిపారు.

గతంలో అసంతృప్తితో గోఖలే.. గతంలో జీజీహెచ్‌లో గోఖలే సేవలు అందించినపుడు ప్రభుత్వం నుంచి కొన్ని సమస్యలెదుర య్యాయి. దీంతో ఆయన మనస్థాపం చెంది సేవలను కొనసాగించ లేకపోయారు. అనంతరం జీజీహెచ్‌ వైద్యులు తామే శస్త్ర చికిత్సలు చేస్తామని ప్రకటించినప్పటికీ ప్రజల నుంచి ఆదరణ లభించలేదు. గతంలో గోఖలే ప్రతిరోజూ రెండు శస్త్రచికి త్సలు నిర్వ హించగా ప్రస్తుతం నెలకు రెండు శస్త్రచికిత్సలు కూడా నిర్వహించలేని స్థితికిచేరింది. దీంతో ఏడాదిగా ఈసేవలను నిలిపివేశారు.

జీజీహెచ్‌కు ప్రతిష్ఠ తెచ్చిన డాక్టర్‌ గోఖలే ..

డాక్టర్‌ గోపాలకృష్ణ గోఖలే తన సేవలతో జీజీహెచ్‌కి ఎంతో ఖ్యాతి తెచ్చిపెట్టారు. జీఎంసీ పూర్వ విద్యార్ధి కావడంతో తన సేవలను ఆ ఆస్పత్రిలో కొనసాగించాలని నిర్ణయించుకొని తొలిసారి గుండె మార్పి డిని జీజీహెచ్‌లో నిర్వహించారు. అనంతరం సహృదయ ట్రస్టు పేరుతో హృదయ శస్త్రచికత్సలు విజయవంతంగా నిర్వహించారు. అనంతరం చిన్నారులకుఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహిం చడంతో వేలాది మంది దీనిని వినియోగించుకున్నారు. ఇలా ఎంతో మంది రోగులు లబ్ధి పొందారు. ఇప్పుడు మళ్లీ జీజీహెచ్‌లో డాక్టర్‌ గోఖలే సేవలు పునః ప్రారంభంకావడం శుభపరిణామంగా జిల్లా ప్రజలు భావిస్తున్నారు.

Updated Date - 2022-12-16T01:03:16+05:30 IST