-
-
Home » Andhra Pradesh » Guntur » Funds are ours Stickers are yours Suryanarayana King mvs-MRGS-AndhraPradesh
-
AP News: నిధులు మావి.. స్టిక్కర్లు మీవా? : సూర్యనారాయణ రాజు
ABN , First Publish Date - 2022-09-19T21:26:47+05:30 IST
Vijayawada: సీఎం జగన్ (CM Jagan) పాలనా తీరును బీజేపీ (BJP) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రాజు తూర్పార బట్టారు. ఎన్నికలకు ముందు జగన్ (Jagan) ఇచ్చిన హామీలను అమలు పర్చడంలో విఫలమయ్యారని, ఆరోపించారు. మద్య నిషేధాన్ని పూర్తిగా అమలు చేస్తామని చెప్పిన జగన్

Vijayawada: సీఎం జగన్ (CM Jagan) పాలనా తీరును బీజేపీ (BJP) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రాజు తూర్పార బట్టారు. ఎన్నికలకు ముందు జగన్ (Jagan) ఇచ్చిన హామీలను అమలు పర్చడంలో విఫలమయ్యారని, ఆరోపించారు. మద్య నిషేధాన్ని పూర్తిగా అమలు చేస్తామని చెప్పిన జగన్ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని విమర్శిస్తున్నారు. కేంద్రం అనేక పధకాలు అమలు చేస్తుంటే.. ఏపీ ప్రభుత్వం తమ స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి కోసం కేంద్రం నిధులు మంజూరు చేస్తే.. ఆ ప్రాజెక్టుల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం కనీసం భూములు కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం 75శాతం వాటా ఇస్తే..రాష్ట్ర ప్రభుత్వం 25శాతం వాటా కూడా కేటాయించడం లేదని పేర్కొన్నారు. ఏపీలో ఇసుక దొరకక, భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి (19వ తేదీ) నుంచి బీజేపీ పోరు యాత్ర ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ యాత్రలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని కోరారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలు, మోడీ చేసిన అభివృద్ధిని వివరించేలా ఐదు వేల స్ట్రీట్ కార్నర్ సభలు నిర్వహిస్తున్నామని చెప్పారు.