రాజధాని అంశం: హైకోర్టు తీర్పుపై మోదుగుల సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-03-03T19:36:20+05:30 IST

రాజధాని విషయంలో హైకోర్టు తీర్పుపై మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాజధాని అంశం: హైకోర్టు తీర్పుపై మోదుగుల సంచలన వ్యాఖ్యలు

గుంటూరు: రాజధాని విషయంలో హైకోర్టు తీర్పుపై మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు అవసరమైన అంశాలను కోర్టులు టేబుల్ మీదకు తీసుకోవడం  లేదన్నారు. తమకు అవసరమైన అంశాలపైనే కోర్టు పరిగణలోకి తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. ‘‘న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థలలో ఎవరు గొప్పా..?..దీనిపై పూర్తి స్దాయి లో చర్చ జరగాలి..న్యాయ వ్యవస్థ నిద్ర పోతుందా...? న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలగేలా చేయాలి. అంబేద్కర్ రాజ్యంగాన్ని అవమానపరుస్తారా...? రాష్ట్ర విభజన ఎలా జరిగిందో దేశ ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ రాష్టాన్ని నాశనం చేసింది. అందులో బీజేపీ పాత్ర కూడా ఉంది. రాష్ట్ర విభజనపై వేసిన పిటిషన్‌లపై ఎందుకు వాదనలు జరగడం లేదు. అసెంబ్లీలో చేసిన తీర్మానాలు చెల్లవని కోర్టులు చెప్పడం ఏంటి. మూడు రాజధానులకు మేము కట్టుబడి ఉన్నాం. ఎంపీ గల్లా జయదేవ్ ఎన్నిక చెల్లదని కోర్టులో పిటిషన్ వేశాం. 2019 లో వేసిన పిటిషన్ ను కోర్టు ఎందుకు పట్టించుకోవడం లేదు. ముందు రాష్ట్ర విభజన పిటిషన్‌లపై తీర్పులు ఇవ్వాలి’’ అంటూ మోదుగుల డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-03-03T19:36:20+05:30 IST