ప్రయాణికుల కోసం రైల్వే

ABN , First Publish Date - 2022-08-12T05:48:36+05:30 IST

ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చి వారికి ఉన్నతమైన సేవలందించమే లక్ష్యంగా రైల్వే కృషి చేస్తున్నట్లు డీఆర్‌ఎం మోహన్‌రాజా తెలిపారు.

ప్రయాణికుల కోసం రైల్వే
నూతనంగా నిర్మించిన భవానాన్ని పరిశీలిస్తున్న డీఆర్‌ఎం మోహన్‌రాజా

సేవలందించడమే లక్ష్యమన్న డీఆర్‌ఎం

శావల్యాపురం, ఆగస్టు 11: ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చి వారికి ఉన్నతమైన సేవలందించమే లక్ష్యంగా రైల్వే కృషి చేస్తున్నట్లు డీఆర్‌ఎం మోహన్‌రాజా తెలిపారు. సాధారణ తనిఖీల్లో భాగంగా శావల్యాపురం రైల్వేస్టేషన్‌ను ఆయన గురువారం పరిశీలించారు. రైల్వేస్టేషన్‌లో నిర్మించిన భవనాలు, సిగ్నల్‌ వ్యవస్థ, రికార్డులను పరిశీలించారు. శిథిలావస్థకు చేరుకున్న పాతభవనాలను వెంటనే తొలగించాలని సూచించారు. రైల్వే ఉద్యోగులకు క్వార్టర్స్‌ సమస్య త్వరలో పరిష్కరిస్తామని సిబ్బందికి హామీ ఇచ్చారు.  అనంతరం రైల్వేస్టేషన్‌ సమీపంలో నూతనంగా నిర్మించనున్న ఆర్‌యూబీ పరిసరాలను పరిశీలించారు. త్వరలో జీఎం పర్యటించనున్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. డీసీఎం ఆంజనేయులు, డీవోఎం బాస్కర్‌రెడ్డి, డీపీవో సీతామహాలక్ష్మి, డీఈఎన్‌ గౌతమ్‌, డీపీవో సీతా శ్రీనివాస్‌, డీఎస్సీ సత్యహరిప్రసాద్‌, శావల్యాపురం స్టేషన్‌ మాస్టర్‌ శివ తదితరులు ఆయన వెంట ఉన్నారు. 


Updated Date - 2022-08-12T05:48:36+05:30 IST