సంక్షేమం పేరుతో దోపిడీకి తెరలేపిన దగాకోరు ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-12-07T00:58:31+05:30 IST

పేదల సంక్షేమం పేరుతో దోపిడీకి తెరలేపిన దగాకోరు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ విమర్శించారు.

సంక్షేమం పేరుతో దోపిడీకి తెరలేపిన దగాకోరు ప్రభుత్వం

సంక్షేమ పథకాల లబ్ధి వివరాలను తెలుసుకుంటున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్‌

తెనాలి రూరల్‌, డిసెంబరు 6 : పేదల సంక్షేమం పేరుతో దోపిడీకి తెరలేపిన దగాకోరు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ విమర్శించారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని 18వ వార్డులో పర్యటించారు. వార్డులో నివసిస్తున్న ఓ వృద్ధదంపతులు పొందిన సంక్షేమ పుస్తకాన్ని పరిశీలించారు. వృద్ధదంపతుల సంక్షేమ పుస్తకంలో ఇంటి స్థలానికి రూ.6 లక్షలు, ఇల్లు కింద రూ.2.5 లక్షలు, ఇతర పథకాలతో కలిసి రూ.9,21,776గా ఇచ్చినట్లు పొందుపరిచారు. దీంతో ఆ దంపతులను ఇంత మొత్త్తంలో లబ్ధిపొందారా అని ప్రశ్నించగా ఇవ్వలేదని సమాధానం చెప్పారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నారై ఆస్పత్రి, మెడికల్‌ కళాశాలల్లో ఈడీ సోదాలంటూ ఆలపాటిపై సీఎం సొంతమీడియాలో లేనిపోని ప్రచారాలు చేయడంపై తీవ్రంగా ఖండించారు. తాను ధర్మబద్ధంగానే నడుచుకుంటానని ఎక్కడా తలవంచేప్రసక్తే లేదన్నారు. తనపై బురదజల్లేందుకు లోకల్‌ నాయకుడు తీవ్రంగా ప్రయత్నించి చివరకు అతడే బురదలో కూరుకుపోయాడని ఆరోపించారు. పలువురు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:58:37+05:30 IST