యువకుడి అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2022-08-17T05:44:46+05:30 IST

పట్టణంలోని ఐలాండ్‌ సెంటర్‌లో యువకుడు అనుమానాస్పద రీతిలో మృతిచెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది.

యువకుడి అనుమానాస్పద మృతి
షేక్‌ సుభాని పాతచిత్రం

హత్యగా అనుమానిస్తున్న పోలీసులు

పొన్నూరుటౌన్‌, ఆగస్టు 16: పట్టణంలోని ఐలాండ్‌ సెంటర్‌లో యువకుడు అనుమానాస్పద రీతిలో మృతిచెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. అర్బన్‌ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. డీవీసీ కాలనీకి చెందిన షేక్‌ సుభాని(26) పట్టణంలోని ఓ ఆగ్రో ఇండస్ట్రీస్‌లో వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. కూతవేట దూరంలో ఇల్లు ఉన్నప్పటికీ వారం రోజులుగా పట్టణంలోని ఓ లాడ్జిలో ఉంటున్నాడు. సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో లాడ్జి నుంచి బయటకు వెళ్లిన సుభాని తర్వాత ఏం జరిగిందో తెలియదు తీవ్ర గాయమై అధిక రక్తస్రావం జరిగి మృతిచెందిన స్థితిలో పోలీసులు గుర్తించారు. మృతుడు భవనం పై నుంచి పడి చనిపోయి ఉంటాడని తొలుత భావించినప్పటికీ తలపై ఉన్న తీవ్ర గాయాన్నిబట్టి మృతుడు హత్యకు గురయ్యాడనే కోణంలో కూడా అర్బన్‌ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిడుబ్రోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అర్బన్‌ సీఐ పి.శరత్‌బాబు, ఎస్‌ఐలు శ్రీనివాసరావు, హషీమ్‌లు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Read more