ఢిల్లీకి బయల్దేరిన గణపవరం రైతులు

ABN , First Publish Date - 2022-12-16T00:51:35+05:30 IST

రాష్ట్ర రాజాధానిగా అమరావతే ఉండాలని దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద అమరావతి రైతులు చేపట్టనున్న దీక్షలో రాజుపాలెం మండలంలోని గణపవరం గ్రామ రైతులు పాల్గొననున్నారు.

ఢిల్లీకి బయల్దేరిన గణపవరం రైతులు

రాజుపాలెం, డిసెంబరు 15: రాష్ట్ర రాజాధానిగా అమరావతే ఉండాలని దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద అమరావతి రైతులు చేపట్టనున్న దీక్షలో రాజుపాలెం మండలంలోని గణపవరం గ్రామ రైతులు పాల్గొననున్నారు. గ్రామ టీడీపీ నాయకులు డాక్టర్‌ వడ్డెంపూడి పవన్‌కుమార్‌ ఆధ్వర్యంలో సతైనపల్లి నియోజకవర్గం నుంచి సుమారు 40 మంది రైతులు దిల్లీకి తరలివెళ్లారు. వాహనాలను సతైనపల్లి నియోజకవర్గ అమరావతి పరిరక్షణ కమిటీ కన్వీనర్‌ నరిశెట్టి వేణుగోపాల్‌, అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు, ఎం.వెంకట్రామయ్య, శారదలు జెండా ఊపి ప్రారంభించారు.

Updated Date - 2022-12-16T00:51:38+05:30 IST