రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

ABN , First Publish Date - 2022-09-29T06:08:18+05:30 IST

ఒంగోలు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్తెనపల్లి పట్టణానికి చెందిన కందకట్ల సీతారామయ్య(65), భార్య సుశీల(58) మృతిచెందారు.

రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి
ఒంగోలు దగ్గర జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందిన కందకట్ల సీతారామయ్య, సుశీల (ఫైల్‌ ఫొటో)

కొడుకుకు తీవ్రగాయాలు 


సత్తెనపల్లి, ఒంగోలు, సెప్టెంబరు28: ఒంగోలు వద్ద  బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్తెనపల్లి పట్టణానికి చెందిన కందకట్ల సీతారామయ్య(65),  భార్య సుశీల(58) మృతిచెందారు. కుమారుడు కందగట్ల శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. సీతారామయ్యకు నెలక్రితం చెన్నైలో బైపాస్‌సర్జరీ జరిగింది. అప్పటినుంచి భార్యతో కలిసి చెన్నైలో కుమార్తె వద్ద ఉంటున్నారు. అక్కడినుంచి తల్లిదండ్రులను తీసుకొచ్చేందుకు కుమారుడైన శ్రీనివాసరావు చెన్నై వెళ్లాడు. శ్రీనివాసరావు డ్రైవింగ్‌ చేస్తూ తల్లిదండ్రులను తీసుకొని వస్తుండగా  జాతీయ రహదారిలో కొప్పోలు ప్లైఓవర్‌ బ్రిడ్జిపైన ముందు వెళుతున్న టిప్పర్‌ను కారు ఢీకొట్టింది.  దీంతో  సీతారామయ్య, సుశీల అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more