సూపర్‌మార్కెట్‌లో రూ.10లక్షలు చోరీ

ABN , First Publish Date - 2022-12-13T00:44:24+05:30 IST

ఎంటీఎంసీ పరిధిలోని తాడేపల్లి జాతీయ రహదారి వెంబడి ఉన్న ఉషోదయ సూపర్‌మార్కెట్‌లో చోరీ జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది.

సూపర్‌మార్కెట్‌లో రూ.10లక్షలు చోరీ

తాడేపల్లి టౌన్‌, డిసెంబరు 12: ఎంటీఎంసీ పరిధిలోని తాడేపల్లి జాతీయ రహదారి వెంబడి ఉన్న ఉషోదయ సూపర్‌మార్కెట్‌లో చోరీ జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. సోమవారం సంఘటనా స్థలానికి చేరుకున్న తాడేపల్లి సీఐలు శేషగిరిరావు, సాంబశివరావు సీసీ టీవీ ఫుటేజిలను పరిఽశీలించారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ చోరీ జరిగినట్టు గుర్తించారు. లాకర్‌లో ఉన్న రూ.10లక్షల నగదుతో పాటు పలు వస్తువులు కూడా చోరీకి గురయ్యాయని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు సూపర్‌మార్కెట్‌ నిర్వాహకులు తెలిపారు. క్లూస్‌ టీమ్‌ వచ్చి సూపర్‌మార్కెట్‌లో చోరీ జరిగిన చోట పరిసర ప్రాంతాల్లో పరిశీలించింది. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-12-13T00:44:24+05:30 IST

Read more