30న క్రికెట్ జట్టు ఎంపికలు
ABN , First Publish Date - 2022-05-28T05:57:25+05:30 IST
రాష్ట్రస్థాయి అంతర్‌జిల్లా అండర్- 19 పోటీలలో పాల్గొనే గుంటూరు జిల్లా పురుషుల క్రికెట్ జట్టు ఎంపిక ప్రక్రియను జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదిన అరండల్‌పేటలోని గురవయ్య పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహిస్తున్నట్టు సంఘ కార్యదర్శి రమేష్‌కుమార్ తెలిపారు.

గుంటూరు(క్రీడలు), మే 27: రాష్ట్రస్థాయి అంతర్‌జిల్లా అండర్- 19 పోటీలలో పాల్గొనే గుంటూరు జిల్లా పురుషుల క్రికెట్ జట్టు ఎంపిక ప్రక్రియను జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదిన అరండల్‌పేటలోని గురవయ్య పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహిస్తున్నట్టు సంఘ కార్యదర్శి రమేష్‌కుమార్ తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు అదే రోజు ఉదయం 7 గంటలకు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్ తీసుకుని తెలుపు రంగు క్రీడా దుస్తులతో హాజరవ్వాలని పేర్కొన్నారు. అండర్-16 విభాగంలో జోనల్ స్ధాయి పోటీలను జూన్ 10 నుంచి 22 వరకు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు రమణమూర్తి, సభ్యులు వై.శ్రీధర్, రవిశంకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.