రాజధానిలో సమస్యలను పరిష్కరించండి

ABN , First Publish Date - 2022-02-16T05:53:07+05:30 IST

రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల ప్రజల సమస్యలను పరిష్కరించాలని సీఆర్డీఏ కమిషనర్‌ విజయకృష్ణనన్‌ను అమరావతి జేఏసీ సభ్యులు కోరారు.

రాజధానిలో సమస్యలను పరిష్కరించండి
సీఆర్డీఏ కమిషనర్‌కు వినతిపత్రం అంజేస్తు జేఏసీ సభ్యులు

సీఆర్డీఏ కమిషనర్‌కు అమరావతి జేఏసీ వినతి 

తుళ్లూరు, ఫిబ్రవరి 15: రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల ప్రజల సమస్యలను పరిష్కరించాలని సీఆర్డీఏ కమిషనర్‌ విజయకృష్ణనన్‌ను అమరావతి జేఏసీ సభ్యులు కోరారు.  మంగళవారం వారు విజయవాడ కార్యాలయంలో ఆయన్ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వం ల్యాండు పూలింగ్‌కింద తమ భూములు తీసుకున్నదని అయినా ఇప్పటికీ సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రైతులకిచ్చిన పాట్లలో రోడ్లను వేయించాలన్నారు. భూములను తనఖా పెట్టి సీఆర్డీఏ తీసుకునే రుణాన్ని రాజధానిలో ఏయే పనుల నిమిత్తం వాడుతున్నారో తెలియపరచాలని నాయకులు కోరారు. సీఆర్డీఏ చొరవ తీసుకొని  రైతులకు కూడా బ్యాకర్స్‌తో మాట్లాడి  రుణ సౌకర్య కల్పించాలని కోరారు. అసైన్డ్‌ భూముల రిజిసే్ట్రషన్‌ జరగటం లేదని, కౌల్లు చెల్లించడం లేదని, పింఛన్లు జమచేయడంలేదని, ప్లాట్ల లాటరీలు తీయడంలేదన్నారు. రాజధానిలో సామగ్రి చోరీకి గురవుతున్నందుకు కమిటీ వేసి వాటిని అరికట్టాలన్నారు. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం కొండవీటి, పాలవాగులను అభివృద్ధి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్‌ పువ్వాడ సుధాకరరావు, ప్రధాన కార్యదర్శి బెజవాడ రమేష్‌, సమన్వయ కమిటీ సభ్యులు బెల్లంకొండ నరసింహారావు, కొండెపాటి సతీష్‌ చంద్ర(బుజ్జి), జూజల చలపతి రావు, కారుమంచి నరేంద్ర, ఆలూరి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.  


Updated Date - 2022-02-16T05:53:07+05:30 IST