AP News: చేనేత కార్మికుల పొట్టకొట్టారు: నారాయణ
ABN , First Publish Date - 2022-08-14T23:05:11+05:30 IST
Tirupati: తుడా మైదానంలో సీపీఐ(CPI) మొదటి జిల్లా మహసభలు ప్రారంభమయ్యాయి. సభలను పురస్కరించుకుని మున్సిపల్ కార్పొరేషన్ నుంచి తుడా మైదానం వరకు నిర్వహించిన

Tirupati: సీపీఐ(CPI) మొదటి జిల్లా మహసభలు తిరుపతి తుడా మైదానంలో ప్రారంభమయ్యాయి. సభలను పురస్కరించుకుని మున్సిపల్ కార్పొరేషన్ నుంచి తుడా మైదానం వరకు నిర్వహించిన ర్యాలీలో పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ (Narayana), రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna), నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ జాతీయ జెండాను అమ్మకానికి పెట్టిన ఘనత బీజేపి ప్రభుత్యానిదని, ముందస్తు ప్రణాళిక లేకుండా చైనా నుంచి నాణ్యత లేని జాతీయ జెండాలను దిగుమతి చేసుకుని చేనేత కార్మికుల పొట్టకొట్టారని విమర్శించారు. బీజేపీ వ్యతిరేక పార్టీలు ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరముందన్నారు.