జనవరి నాటికి 175 ఆలయాల్లో కంప్యూటరీకరణ
ABN , First Publish Date - 2022-12-15T03:36:42+05:30 IST
రాష్ట్రంలో మరో 175 దేవాలయాలను వచ్చే నెలాఖరులోపు పూర్తిస్థాయిలో కంప్యూటరీకరించాలని దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశించారు.
టీటీడీ మాదిరిగా దేవాలయాల్లో ప్రొటోకాల్: మంత్రి కొట్టు
అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరో 175 దేవాలయాలను వచ్చే నెలాఖరులోపు పూర్తిస్థాయిలో కంప్యూటరీకరించాలని దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశించారు. బుధవారం విజయవాడలోని దేవదాయ శాఖ క్యాంప్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ‘‘ఇప్పటికే 16 దేవాలయాల్లో అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ సేవలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. రాష్ట్రంలో 16 ప్రధాన దేవాలయాల్లో విద్యుత్‌కు అంతరాయం లేకుండా యూపీఎ్‌సలు ఉపయోగించాలి. ఇప్పటివరకూ 185 దేవాలయాలకు ధూపదీప నైవేద్యం పథకం మంజూరు ప్రతిపాదనలు వచ్చాయి. టీటీడీ తరహాలో మిగిలిన ఆలయాల్లో ప్రొటోకాల్‌ను అనుసరించటానికి కమిషనర్ తగిన మార్గదర్శకాలు జారీ చేయాలి. అన్నదానం, శానిటేషన్ సిబ్బంది నియామకాల్లో టెండర్ ప్రక్రియ పాటించాలి’’ అని మంత్రి సూచించారు.