కాంపౌండర్‌ అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2022-02-16T05:33:56+05:30 IST

పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రిలో కాంపౌండర్‌గా పని చేసే మోరబోయిన రామాంజీ(25) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు సోమవారం మొదటి పట్టణ పోలీసులు తెలిపారు.

కాంపౌండర్‌ అనుమానాస్పద మృతి

నరసరావుపేట లీగల్‌, ఫిబ్రవరి 15: పట్టణంలోని  ప్రైవేటు ఆస్పత్రిలో కాంపౌండర్‌గా పని చేసే మోరబోయిన రామాంజీ(25) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు సోమవారం మొదటి పట్టణ పోలీసులు తెలిపారు.  దుర్గి మండలం అడిగొప్పుల గ్రామానికి చెందిన రామాంజీ శ్రీరాంపురంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. నాలుగు రోజుల నుంచి అతడు ఇంటి నుంచి బయటకు రాలేదు. ఆ ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇంటి యజమాని రామాంజి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.  వారు వచ్చి తలుపులు పగల గొట్టి చూడగా రామాంజీ మృతి చెంది ఉన్నాడు. ఇంజక్షన చేసుకుని ఉన్నట్లు తల్లిదండ్రులు గుర్తించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.  

Read more