AP News: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ నేతల ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-10-08T01:07:37+05:30 IST

Amaravathi: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా‌ను టీడీపీ నేతలు కలిశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు వలంటీర్‌లను ఉపయోగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. పులివెందుల మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన ఆడియో ఆదేశాలను వారు సీఈవోకు సమర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ వలం

AP News: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ నేతల ఫిర్యాదు

Amaravathi: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా‌ను టీడీపీ (TDP) నేతలు కలిశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు వలంటీర్‌లను ఉపయోగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. వైసీపీకి అనుకూలంగా గ్రాడ్యుయేట్ ఓటర్ల డేటా కోసం వలంటీర్లను, సచి‌వాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసిన  పులివెందుల మున్సిపల్ కమిషనర్  ఆడియో ఆదేశాలను వారు సీఈవోకు సమర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు (Ashok Babu) మాట్లాడుతూ వలంటీర్లను వాడవద్దని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చినా కొంతమంది అధికారులు పట్టించుకోవడం లేదని, సాక్ష్యాలతో సహా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. ఈసీ చర్యలు తీసుకోకుంటే ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేస్తామని లేదంటే న్యాయ పోరాటం దిగుతామని చెప్పారు.  

Updated Date - 2022-10-08T01:07:37+05:30 IST