ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2022-03-05T05:41:29+05:30 IST
జగనన్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా జరిగేలా గృహనిర్మాణ శాఖ, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఏపీఎం, సీఓలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వివేక్‌యాదవ్ ఆదేశించారు.
కలెక్టర్ వివేక్ యాదవ్
గుంటూరు, మార్చి 4(ఆంధ్రజ్యోతి): జగనన్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా జరిగేలా గృహనిర్మాణ శాఖ, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఏపీఎం, సీఓలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వివేక్‌యాదవ్ ఆదేశించారు. శుక్రవారం ఆయన వట్టిచెరుకూరు మండలం పరిధిలోని కొర్నెపాడు, పశ్చిమ మండల పరిధిలోని పొత్తూరు గ్రామంలోని పేదలందరికీ ఇళ్ల లే అవుట్‌లలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. కొర్నెపాడు లేఅవుట్‌లో కొర్నెపాడు, పుల్లడిగుంట, చింతపల్లిపాడు, కాట్రపాడు, కుర్నతల గ్రామాలకు చెందిన 257 మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు చేయగా ఇప్పటి వరకు 138 ఇళ్లు బిలో బేస్ మెంట్‌లెవల్‌లోను, 68 ఇళ్లు బేస్మెంట్ లెవల్‌లో, 29 ఇళ్లు రూఫ్ లెవల్‌లో, 11 ఇళ్లకు స్లాబ్‌లు పూర్తి అయ్యాయని తెలిపారు. పొత్తూరు లే అవుట్‌లో అర్భన్ పరిధిలో, రూరల్ పరిధిలోని 625మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయగా, ఇప్పటి వరకు బిలో బేస్‌మెంట్ లెవల్ 434 ఇళ్లు, బేస్మెంట్ లెవల్ 57ఇళ్లు, రూఫ్ లెవల్ 11 ఇళ్లు, స్లాబ్‌లు పూర్తయిని 12 ఇళ్లు ఉన్నాయని తెలిపారు. మండలపరిధిలో ఉన్న లే అవుట్‌లలో ఇళ్ల నిర్మాణాల పర్యవేక్షణలో ఎంపీడీవోలు ఆశించినస్థాయిలో శ్రద్ధ చూపటం లేదని తెలుస్తుందని, ప్రతి లే అవుట్‌లో ఇళ్ల నిర్మాణాలు నిర్ధేశించిన స్థాయిలో పురోగతి ఉండేలా చర్యలు తీసుకోవలన్నారు. కొర్నెపాడు లే అవుట్‌లో భవిష్యత్తులో తాగునీరు అవసరాల కోసం పుల్లడిగుంట చెరువుకు గుంటూరు కెనాల్ నుంచి పైప్‌లైను ఏర్పాటు పనులు మంజూరుకు, పొత్తూరు లే అవుట్‌లో ఇసుక, నిర్మాణ సామగ్రి దొంగతనాలు జరగకుండా పర్యవేక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ అదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ భాస్కరరెడ్డి, హౌసింగ్ ఈఈ శంకరరావు, పశ్చిమ మండల తహశీల్దారు వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ సుజాత, హౌసింగ్, డీఆర్డీఏ, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఎమినిటీస్ సెక్రటరీలు పాల్గొన్నారు.