చెత్తగించండి!

ABN , First Publish Date - 2022-12-12T23:57:11+05:30 IST

చెత్తపన్ను చెల్లించడానికి పురపౌరులు ససేమిరా అంటున్నారు. నెలవారీ టార్గెట్లను అధికమించడంతో మునిసిపాల్టీలు చతికలపడుతున్నాయి. పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని ఆరు పురపాలక సంఘాల్లో ప్రభుత్వం చెత్తకు పన్నును అమల్లోకి తీసు కొచ్చింది.

చెత్తగించండి!
చెత్త సేకరణ ఆటోలు

ఇప్పుడున్న పన్నులు కాక.. చెత్తపై కూడా పన్నా.. మేం కట్టబోం.. అంటూ ప్రజలు భీష్మిస్తున్నారు. దీంతో పురపాలక సంఘా ల్లో చెత్త పన్ను బకాయిలు పేరుకుపోతున్నాయి. నెలవారీ వసూలుతో పాటు బకాయిలు వసూలు చేయాల్సిందే అంటూ ప్రభుత్వం మునిసిపాలిటీలకు హుకుం జారీచేసింది. ఈ నేపథ్యంలో వార్డు శాని టేషన్‌ కార్యదర్శులకు మునిసిపల్‌ అధికారులు టార్గెట్లు ఇస్తున్నారు. వీరు వలంటీర్లపై ఆధార పడుతున్నారు. చెత్త పన్ను వసూలులో భాగంగా వలంటీర్లు పింఛన్‌దారులను టార్గెట్‌ చేస్తున్నారు. వారి నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతు న్నారు. చెత్తపన్ను వసూలు కు టార్గెట్లు విధిస్తున్న ప్రభుత్వం అపరి శుభ్రత విష యంలో మిన్నకుంటోది. ప్రజల నుంచి ముక్కుపిండి చెత్త పన్ను వసూలు చేస్తున్న మునిసి పాల్టీలు పరిశుభ్రత వాతా వర ణం కల్పించడంలో విఫల మయ్యాయి. చెత్త సేకరణకు ఏర్పాటు చేసిన అద్దె ఆటోల మాటున ప్రజాధనం దోపిడీ చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమ వుతున్నాయి.

నరసరావుపేట, డిసెంబరు12: చెత్తపన్ను చెల్లించడానికి పురపౌరులు ససేమిరా అంటున్నారు. నెలవారీ టార్గెట్లను అధికమించడంతో మునిసిపాల్టీలు చతికలపడుతున్నాయి. పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని ఆరు పురపాలక సంఘాల్లో ప్రభుత్వం చెత్తకు పన్నును అమల్లోకి తీసు కొచ్చింది. ఒక్కో ఇంటి నుంచి నెలకు చెత్త సేక రణ కోసం రూ.60 పన్ను వసూలు చేస్తున్నారు. చెత్త పన్ను వసూలు ను పుర పౌరులు తీవ్రంగా వ్య తిరేకిస్తున్నారు. పన్ను వసూ లు కాకపోవడంతో సచివా లయ శానిటేషన్‌ కార్యద ర్శులకు మునిసిపల్‌ అధి కారులు లక్ష్యాలను నిర్ధేశి స్తున్నారు. వీరు వారి పరి ధిలోని వలంటీర్లపై వత్తిడి తెస్తున్నారు. చివరకు పిం ఛన్‌ చెల్లించే సమయంలో వృద్ధులని కూడా చూడకుండా చెత్తపన్నును బలవంతంగా వారి నుంచి వసూలు చేస్తున్నారు. ప్రభు త్వం ఉచితంగానే పింఛన్‌ ఇస్తుంది కదా.. చెత్తపన్ను చెల్లించాల్సిందేనని కొందరు వలంటీర్లు వృద్ధుల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని పురపాలక సంఘాల్లో కార్యదర్శుల నుంచి మునిసిపల్‌ అధికారులు ముందు గానే పన్ను వసూలు చేస్తున్నారు. అ నంతరం కార్యదర్శులు.. వారు చెల్లిం చిన పేర్లు కలిగిన వారిని బతిమిలా డుకోవాల్సిన దుస్థితి నెలకొంటోంది.

పన్ను వసూలులో చతికిల..

నరసరావుపేట, చిలకలూరిపేట, తెనాలి, మంగళగిరి తాడేపల్లి(ప్రస్తుత ఎంటీఎంసీ) చీరాల, బాపట్ల మునిసిపాల్టీల్లో ఇది అమలవు తోంది. మూడు జిల్లాల్లోని ఈ ఆరు పురపాలక సంఘా ల్లో రూ.12.22 కోట్ల చెత్త పన్ను వసూలు చేయాలి. ఇప్ప టివరకు రూ.4.13 కోట్లు వసూలు చేశారు. వసూలులో మంగళగిరి తాడేపల్లి(ఎంటీఎంసీ) అట్టడుగున ఉన్నట్టు మున్సిపల్‌ పరిపాలన విభాగం ప్రకటించింది. 13.93 శాతమే ఇక్కడ పన్ను వసూలైనట్టు పేర్కొంది. తెనాలి మునిసిపాలిటీ చెత్తపన్ను వసూ లులో ముందు వరుసలో ఉంది. ఇక్కడ 52.39 శాతం చెత్తపన్ను వసూలైనట్టు తెలిపింది. చిలకలూ రిపేట, నరసరావుపేట మునిసిపాలిటీలు కూడా చెత్త పన్ను వసూలులో చతికిలపడ్డాయి. పురపౌరుల నుంచి వస్తున్న వ్యతిరేకత వలనే చెత్త పన్ను లక్ష్యాల మేర వసూలు కావడంలేదన్న అభి ప్రాయం ఆయా వర్గాల నుంచి వినిపిస్తుం డటం గమనార్హం.

ఆటోలు.. ఆర్థిక భారమే..

ఇంటింటి నుంచి చెత్త సేకరణకు ప్రభుత్వం అద్దె ఆటోలను ఏర్పాటు చేసింది. ఒక్కో ఆటోకు నెలకు మునిసిపాలిటీ రూ.63,600 అద్దె చెల్లిస్తోంది. ఇలా ఏడాదికి ఒక్కో ఆటోకు రూ.7,65,600 చెల్లిస్తున్నారు. ఈ అద్దెకు నాలుగు ఆటోలను కొనుగోలు చేయవచ్చని ఆర్థికనిపుణుల చెబుతున్నారు. నరసరావుపేట పురపాలక సంఘంలో 23 ఆటోలు, తెనాలిలో 40, బాపట్లలో 8, మంగళగిరి తాడేపల్లిలో 63, చిలకలూరిపేటలో 23, చీరాలలో 11 ఆటోలను నెలవారీ అద్దె చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. నరసరావుపేటలో నెలకు రూ.14,62,000, తెనాలిలో రూ.25,44,000.. అద్దె చెల్లిస్తున్నారు. చెత్త పన్ను వసూలు నుంచి ఆటోల అద్దె చెల్లించాలని ప్రభుత్వం మునిసిపాల్టీలకు సూచించింది. ఆటోల అద్దెకు అనుగుణంగా చెత్తపన్ను వసూలు కావడంలేదు. దీంతో మునిసిపాల్టీలు సాధారణ నిధుల నుంచి చెల్లిస్తున్నాయి. గతంలో ఇంటింటి నుంచి కార్మికులు చెత్త సేకరణ చేసేవారు. ఆటోల వలన కార్మికుల సంఖ్య ఏమీ తగ్గలేదు. సదరు కార్మికులే ఆటోలకు కూడా చెత్త సేకరణ చేస్తున్నారు.

=============================================================

Updated Date - 2022-12-12T23:57:15+05:30 IST