నేతన్న రక్షణ విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం
ABN , First Publish Date - 2022-12-16T01:14:56+05:30 IST
అధికారంలోకి రాగానే చేనేత రక్షణకు కట్టుబడి ఉంటానని చెప్పిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే ఆ హామీని విస్మరించారని చేనేత కార్మికసంఘం జిల్లా అధ్య క్షుడు కేతరపు వెంకటేశ్వర్లు విమర్శించారు.
జిల్లా చేనేత, జౌళి కార్యాలయం ఎదుట నిరసన
గుంటూరు(తూర్పు), డిసెంబరు 15: అధికారంలోకి రాగానే చేనేత రక్షణకు కట్టుబడి ఉంటానని చెప్పిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే ఆ హామీని విస్మరించారని చేనేత కార్మికసంఘం జిల్లా అధ్య క్షుడు కేతరపు వెంకటేశ్వర్లు విమర్శించారు. చేనేతల సమస్యలను పరిష్క రించాలంటూ జిల్లా చేనేత, జౌళి శాఖ కార్యాలయం ఎదుట గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ చేనేత రక్షణకు కట్టుబడి ఉన్నాని చెప్పి చిత్తూరు జిల్లా నగరిలో పవర్లూమ్ వస్త్రాలను కొనుగోలు చేసి ముఖ్మమంత్రి చేనేతకు ద్రోహం చేశారన్నారు. సహకార సంఘాలకు చెల్లించాల్సిన పావల వడ్డీ సబ్సీడీ కింద చెల్లించాల్సిన డబ్బు కూడా చెల్లించలేదని గుర్తుచేశారు. ఇది చాలదన్నట్టు కేంద్ర ప్రభుత్వం చేనేతరంగంపై జీఎస్టీ విధించడం, చేనేతకు కేటాయించిన 11 రకాల రిజిస్ట్రేషన్ ఉల్లంఘించి పవరలూమ్ యాజమాన్యానికి రాయితీలు ఇచ్చి ప్రోత్సహించడం వంటి చర్యలతో చేనేత మరింత సంక్షోభంలో కూరుకుపోయిందని విమర్శించారు. అనంతరం సమస్యలను పరిష్కరించా లంటూ జిల్లా చేనేత, జౌళి శాఖ ఏడీ వనజకు వినతిపత్రం అందజేశారు. నిరసనల్లో డి.రామారావు, రాంబాబు, భావన్నారాయణ, నరసింహారావు, సత్యనారాయణ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.