గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం

ABN , First Publish Date - 2022-10-11T05:57:38+05:30 IST

ఈతకు వెళ్లి గల్లంతైన యువకుల మృతదేహాలు కొమ్మమూరు కాలువలో లభ్యమయ్యాయి.

గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం

చేబ్రోలు, అక్టోబర్‌ 10: ఈతకు వెళ్లి గల్లంతైన యువకుల మృతదేహాలు కొమ్మమూరు కాలువలో లభ్యమయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం..  శనివారం కెనాల్‌లో ఈతకు వెళ్లిన ఆరుగురిలో బి.ఉమామహేశ్వరరావు(17), ఎం.సాత్విక్‌(15) ప్రవాహానికి గల్లంతైన విషయం తెలిసిందే. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో, గజ ఈతగాళ్లతో చేపట్టిన గాలింపు చర్యలు సఫలమయ్యాయి. ఆదివారం రాత్రి ఎం.సాత్విక్‌ మృతదేహం శ్రీరంగపురం గ్రామం వద్ద, బి.ఉమామహేశ్వరరావు మృతదేహం సోమవారం ఉదయం చేబ్రోలు సమీపంలో లభ్యమయ్యాయి.  యువకుల మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యువకుల మృతదేహాలను చూసిన తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.   

Read more