వరుడి ఇంటిముందు పెళ్లికూతురు బంధువులు ధర్నా

ABN , First Publish Date - 2022-05-24T06:09:30+05:30 IST

వరుడి ఇంటి ముందు పెళ్లికూతురు బంధువులు నిరసనకు దిగిన ఘటన సోమవారం చేబ్రోలులో చోటుచేసుకుంది.

వరుడి ఇంటిముందు పెళ్లికూతురు బంధువులు ధర్నా
నిరసన తెలుపుతున్న మహిళలు

చేబ్రోలు, మే 23: వరుడి ఇంటి ముందు పెళ్లికూతురు బంధువులు నిరసనకు దిగిన ఘటన సోమవారం చేబ్రోలులో చోటుచేసుకుంది. స్థానికుల కఽథనం ప్రకారం.. మండల కేంద్రమైన చేబ్రోలు పాతరెడ్డిపాలేనికి చెందిన ఓ యువతి అదే గ్రామానికి చెందిన యువకుడు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఆ యువకుడికి చుండూరు మండలంలోని ఆలపాడు గ్రామానికి చెందిన మరో యువతితో నిచ్చితార్ధం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రియుడు మోసం చేయడంతో ప్రేమించిన యువతి ఆదివారం గుంటూరులో కళాశాల భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. కాగా ఆ యువకుడి వివాహం సోమవారం ఆలపాడుకు చెందిన యువతితో జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే పెళ్లికూతురు, ఆమె తరుపు బంధువులు పెళ్లిని రద్దు చేసుకున్నారు. అయితే నిచ్చితార్థ సమయంలో ఇచ్చిన  కట్నకానుకలను తిరిగి ఇవ్వాలంటూ సోమవారం పెళ్లికూతురు తరుపు బంఽధువులు పాత రెడ్డిపాలెం ముట్లూరు రోడ్డులోని అంబేద్కర్‌ బొమ్మ సెంటర్‌లో ధర్నాకు దిగారు. ఈ సమాచారం అందుకున్న చేబ్రోలు పోలీసులు  ఘటనా స్థలానికి చేరుకుని నిరసన తెలుపుతున్న వారితో చర్చించి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు.

Updated Date - 2022-05-24T06:09:30+05:30 IST