డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి చంద్రబాబు లేఖ

ABN , First Publish Date - 2022-06-08T02:58:58+05:30 IST

డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి చంద్రబాబు లేఖ

డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి చంద్రబాబు లేఖ

అమరావతి: డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కుప్పం టీడీపీ నేత, గంగమ్మ గుడి మాజీ చైర్మన్‌ రవిపై వైసీపీ నేతల దాడిని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీ గుండాల వల్ల కుప్పంలో శాంతిభద్రతల సమస్య ఏర్పడిందన్నారు. పీఎస్‌కు 200 మీటర్ల దూరంలో వైసీపీ నేతల గుండాయిజం చేస్తుందన్నారు. దాడికి పాల్పడ్డ వైసీపీ నేతలపై చర్య తీసుకోవాలని చంద్రబాబు కోరారు. వైసీసీ నేతల దాడి ఫొటోలు, సీసీ ఫుటేజ్‌ను లేఖకు ఆయన జతచేశారు. 

Read more