66 మందికి కరోనా

ABN , First Publish Date - 2022-02-16T05:38:15+05:30 IST

కరోనా మూడో దశ కేసులు తగ్గిపోయాయి. దీంతో టెస్టులు చేయించుకునే వారి సంఖ్య కూడా రోజురోజుకు తగ్గిపోతున్నది.

66 మందికి కరోనా

గుంటూరు, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): కరోనా మూడో దశ కేసులు తగ్గిపోయాయి. దీంతో టెస్టులు చేయించుకునే వారి సంఖ్య కూడా రోజురోజుకు తగ్గిపోతున్నది. మంగళవారం 2,166 మంది శాంపిల్స్‌ టెస్టింగ్‌ జరగ్గా 66 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. పాజిటివ్‌ శాతం 3.05గా నమోదైంది. దీంతో క్రియాశీలక కేసులు 1,049కి తగ్గిపోయాయి. 122 మంది ఆస్పత్రుల్లో, ముగ్గురు కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఉన్నారు. చెరుకుపల్లిలో ఒకరు  మృతి చెందారు. కొత్తగా గుంటూరులో 42, మంగళగిరిలో 6, తుళ్లూరు, తాడేపల్లిలో 3 చొప్పున, గుంటూరు రూరల్‌, మేడికొండూరులో 2 చొప్పున, సత్తెనపల్లి, వట్టిచెరుకూరు, నాదెండ్ల, నరసరావుపేట, చేబ్రోలు, దుగ్గిరాల, కొల్లూరు, తెనాలిలో ఒక్కో  కేసు నమోదైనట్లు డీఎంహెచవో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు. 


Updated Date - 2022-02-16T05:38:15+05:30 IST