టీడీపీ కార్యాలయం ముస్తాబు

ABN , First Publish Date - 2022-04-24T05:32:34+05:30 IST

బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యాలయం ప్రారంభానికి ముస్తాబైంది.

టీడీపీ కార్యాలయం ముస్తాబు
ప్రారంభానికి ముస్తాబైన తెలుగుదేశంపార్టీ కార్యాలయాన్ని పరిశీలిస్తున్న పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షులు ఏలూరి సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి వేగేశన నరేంద్రవర్మ తదితర నాయకులు

 రేపు పార్టీ రాష్ర్టాధ్యక్షుడు అచ్చెన్నాయుడిచే ప్రారంభం

 ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా నేతలు  


బాపట్ల,ఏప్రిల్‌ 23: బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యాలయం ప్రారంభానికి ముస్తాబైంది. సూర్యలంకరోడ్డులో నియోజకవర్గ ఇన్‌చార్జి వేగేశన నరేంద్రవర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని శనివారం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్‌లు పార్టీశ్రేణులతో కలిసి పరిశీలించారు. 25వ తేదీ సాయంత్రం 5గంటలకు పార్టీ రాష్ర్టాధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు కార్యాలయాన్ని ప్రారంభిస్తారని చెప్పారు.


అరాచక పాలనపై అలుపెరగని పోరు..

రాష్ట్రంలో అరాచక పాలనపై అలుపెరగని పోరాటం చేస్తామని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. కార్యాలయాన్ని పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో బాపట్ల పార్లమెంట్‌లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో విజయం సాధిస్తామని ఽధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రజల గొంతు నొక్కి అరాచకపాలన చేస్తోందన్నారు. ప్రజలను సమీకరించి పార్లమెంట్‌ స్థాయిలో పార్టీ నిర్మాణం పటిష్టం చేస్తామన్నారు. మహానాడులోపు గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తామన్నారు. రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ మాట్లాడుతూ రాబోయే తరానికి కూడా చంద్రబాబు నాయకత్వం అవసరమన్నారు. క్షేత్రస్థాయిలో టీడీపీ బలంగా ఉందన్నారు. ప్రజలను చైతన్య పరిచి రాక్షస పాలన ఎదుర్కొనేందుకు సిద్ధమౌతున్నామన్నారు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వేగేశన నరేంద్రవర్మ మాట్లాడుతూ కార్యాలయ ప్రారంభోత్సవానికి పార్టీశ్రేణులంతా పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి సలగల రాజశేఖర్‌, రాష్ట్ర మహిళా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ మానం విజేత, పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పల్లం సరోజని, తానికొండ దయాబాబు, పట్టణ, మండలపార్టీఅధ్యక్షులు వడ్లమూడి వెంకటేశ్వరరావు, ముక్కామల సాంబశివరావు, నియోజకవర్గ గౌరవాధ్యక్షులు తోట నారాయణ,  ఫరీదుమస్తాన్‌, కూచిపూడి శ్యామ్‌ సుందర్‌ ఆయా నియోజకవర్గాల నాయకులు పాల్గొన్నారు.

 

Read more