సీఎం జగన్... టీడీపీ కంటే ధరలు తగ్గించి చూపించాలి: Kanna

ABN , First Publish Date - 2022-04-04T18:49:28+05:30 IST

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నవరత్నాలు అమలు చేస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి జగన్ అధికారంలోకి వచ్చారని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.

సీఎం జగన్... టీడీపీ కంటే ధరలు తగ్గించి చూపించాలి: Kanna

గుంటూరు: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు  నవరత్నాలు అమలు చేస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి జగన్ అధికారంలోకి వచ్చారని  బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... 7వ సారి కరెంట్ చార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారం వేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్క  దానిపై ధరలు పెంచారని మండిపడ్డారు. చాక్లెట్ ఇచ్చి నక్లెస్ తీసుకున్నట్లు జగన్ ప్రభుత్వ పాలన ఉందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్... టీడీపీ కంటే ధరలు తగ్గించి చూపించాలని అన్నారు. కేంద్రం ప్రభుత్వం 130 సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పేరుతో 9 తో సరిపెడుతున్నారని వ్యాఖ్యానించారు. పెంచిన విద్యుత్ చార్జీల తగ్గించే వరకు బీజేపీ పోరాటం చేస్తుందని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. 

Updated Date - 2022-04-04T18:49:28+05:30 IST