బీసీ నేతలకు అండగా ఉంటా...
ABN , First Publish Date - 2022-12-15T00:56:27+05:30 IST
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీ సామాజిక వర్గం అణచివేతకు గురవుతున్నారని పదవులు కేటాయించకపోగా అక్రమ కేసులతో అణగదొక్కేస్తున్నారని గురజాల మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు.
ఉన్నత పదవులు కల్పించి భరోసా కల్పిస్తా...
పిడుగురాళ్ల, డిసెంబరు 14: రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీ సామాజిక వర్గం అణచివేతకు గురవుతున్నారని పదవులు కేటాయించకపోగా అక్రమ కేసులతో అణగదొక్కేస్తున్నారని గురజాల మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. బుధవారం పిడుగురాళ్లలో బీసీ శంఖారావం సభ జరిగింది. ఈ సభలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని మాట్లాడుతూ వైసీపీ సొంత సామాజికవర్గ నేతలకే పదవులు కట్టబెడుతున్నారని మిగిలిన సామాజికవర్గాలను దూరం పెడుతున్న విషయాన్ని గుర్తుచేశారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు అన్ని విధాల న్యాయం జరిగిందన్నారు. బీసీలకు రాజ్యాధికారం కల్పించే దిశగా తెలుగుదేశం ఎప్పుడూ పనిచేస్తుందని, గురజాల నియోజకవర్గంలో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవులను బీసీ సామాజిక వర్గానికే కేటాయించిన విషయాన్ని యరపతినేని గుర్తుచేశారు. విధులు ... నిధులు లేని కార్పొరేషన్లను ఏర్పాటుచేసి వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదన్నారు. గురజాల నియోజకవర్గంలో మూడేళ్లుగా జరుగుతున్న అక్రమ మైనింగ్‌తో చిన్నారులు చనిపోయినా ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకోలేదని, పేరుకుమాత్రం బీసీలకు కొన్ని పదవులు ఇచ్చినా పెత్తనం మాత్రం అధికారపార్టీ సామాజిక వర్గమే చేస్తుందన్నారు. రాష్ట్రంలో 1020 పోస్టులకు 960 పోస్టుల్లో ముఖ్యమంత్రి సొంత సామాజిక వర్గానికే కట్టబెట్టారని, డీజీపీ, చీఫ్ సెక్రటరీ, టీటీడీ చైర్మన్, ఈవోతోపాటు అనేక విశ్వ విద్యాలయాల వైస్ చాన్సలర్ పోస్టులను వారి సామాజిక వర్గానికే జగన్ కట్టబెట్టారన్నారు. గురజాల నియోజకవర్గంలో మహిళలపై కాకుండా మగవారిపై కూడా అఘాయిత్యాలు చేసిన ఘనత వైసీపీ నేతలదేనని, తుమ్మలచెరువు, పిన్నెల్లి, తురకపాలెంతోపాటు అనేక గ్రామాల్లో బీసీ నేతలను కాళ్లు చేతులు విరగొట్టి గ్రామం విడిచి వెళ్లేలా వైసీపీ నేతలు చేశారన్నారు.
అధికారంలోకి వస్తే వైసీపీ వారికి పనులు చేస్తా...
అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలకు, ఆ పార్టీ సానుభూతి పరులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ పథకాలను కొనసాగించటంతోపాటు అర్హులైన వారికి మరికొన్ని పథకాలు మంజూరు చేస్తామని యరపతినేని తెలిపారు. గ్రామాల్లో ఇబ్బందులు పడ్డ టీడీపీ నేతలు మాత్రం అలా చేస్తే ఎలా అంటున్నా.... నేను మాత్రం వారిలాగా మనం చేయొద్దని అందర్నీ కలుపుకొని పోతూ గురజాల అభివృద్ధికే పనిచేద్దామని చెప్తున్నానని యరపతినేని తెలిపారు. పేదవాడికి పట్టెడన్నం పెట్టటమే నాకు తెలుసని , వైసీపీ నేతల్లాగా పొట్టలుకొట్టే నైజం తమదికాదన్నారు. గ్రామాల్లో టీడీపీ సానుభూతిపరులు కొందరు పక్ష వాతంతో , మరికొందరు అనారోగ్యంతో బాధపడుతున్నా వారి పింఛన్లు, కార్డులు సైతం వైసీపీ నేతలు తొలగిస్తుండటాన్ని ఇకనైనా మానుకోవాలన్నారు. వైసీపీ నేత గుర వాచారికి జరిగిన ఇబ్బందులను తెలుసుకొని ఆనాడు లక్షరూపాయలు సాయం అందించటంతోపాటు ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించానని, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి, కార్పొరేషన్ చైర్పర్సన్ దేవళ్ల రేవతిపట్ల వైసీపీ నేతలు పక్షపాతఽ దోరణితో లోపల ఒకలా.... బయట మరోలా ప్రవర్తిస్తున్న విషయం అందరికి తెలుస్తుందన్నారు. తొలుత పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోనిప్రధాన వీధుల గుండా సత్యసాయి కల్యాణ మండపం వరకు జరిగింది. సుమారు 5వేల మంది బీసీ సామాజిక వర్గ నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. యువత బైక్ ర్యాలీతో ఆకర్షణగా నిలిచారు. మహిళలు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఐలాండ్ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే యరపతినేనిని భారీ గజమాలతో సత్కరించారు. అనంతరం గురజాల నియోజకవర్గ బీసీసెల్ అధ్యక్షుడిగా బొమ్మనబోయిన నాగరాజుయాదవ్ ప్రమాణస్వీకారం చేశారు.
కార్యక్రమంలో గుంటుపల్లి నాగేశ్వరరావు, నలమేకల వెంకటేశ్వర్లు, గుర్రపుశాల రామకృష్ణ, తురక వీరాస్వామి, ఎ.బాలయ్య, జి.వెంకటేశ్వర్లు, మేకల సాంబశివరావు, బి.వెంకటేశ్వర్లు, ఎం.వెంకటేశ్వర్లు, వి.ఆంజనేయులు, వై. వెంకట్రావు, ఎం.గంగాధర్, ఎం.శ్రీను, జె.లక్ష్మీనారాయణ, బి.బద్రి, పాండురంగ శ్రీను, అడపా శ్రీను, దేవళ్ల రాంబాబు, బత్తుల శ్రీను, వల్లెపు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.