-
-
Home » Andhra Pradesh » Guntur » AP News Varla Ramaiah questions the Jagan government mvs-MRGS-AndhraPradesh
-
AP News: జగన్ ప్రభుత్వంపై వర్ల రామయ్య ప్రశ్నల వర్షం
ABN , First Publish Date - 2022-09-28T01:56:58+05:30 IST
Amaravathi: జగన్ ప్రభుత్వంపై టీడీపీ (TDP) సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) ప్రశ్నల వర్షం కురిపించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు నిందితులెవరో ఇంకా నిర్ధారణ కాలేదు. అసలు వివేకా హత్య కేసులో

Amaravathi: జగన్ ప్రభుత్వంపై టీడీపీ (TDP) సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) ప్రశ్నల వర్షం కురిపించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు నిందితులెవరో ఇంకా నిర్ధారణ కాలేదు. అసలు వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తునకు అడ్డుపడుతున్నదెవరని వర్ల రామయ్య ప్రశ్నించారు. ఖరీదైన లాయర్లతో వివేకా కేసు హంతకులను కాపాడుతున్నదెవరు? సీబీఐ (CBI) అధికారులను కూడా బెదిరించే స్థాయికి. హంతకులను ప్రోత్సహించే ఆ అదృశ్య శక్తి ఎవరు? వివేకా కేసులో పెద్దకుట్ర దాగిఉందన్న సుప్రీం వ్యాఖ్యలు నిజం కాదా? ఈ కుట్రకు సూత్రధారులు, పాత్రధారులెవరో సీఎం సమాధానం చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.