AP News: అరాచక పాలన అంతమొందిస్తా..ప్రజలు తమవంతు బాధ్యత నిర్వర్తించాలి : చంద్రబాబు
ABN , First Publish Date - 2022-08-20T00:15:28+05:30 IST
Amaravathi: ‘రాష్ట్రంలో వైసీపీ (YSRCP) నేతల రౌడీయిజం పరాకాష్టకు చేరింది. అరాచక పాలనకు రోజులు దగ్గర పడ్డాయి. రాష్ట్రాన్ని కాపాడేందుకు నా వంతు కర్తవ్యం నిర్వర్తిస్తా. మీవంతు బాధ్యత కూడా అవసరం.’ అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (TDP Chief Nara Chandra Babu Naidu) ప్రజలను కోరారు.

ఆ ఘటనలు బాధాకరం
‘ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఘటనలు బాధాకరం. నెల్లూరులో ఇసుక మాఫియాను ప్రశ్నించిన కిషన్ శవమై తేలాడు. ఏలూరు జిల్లాలో వైసీపీ ఎంపీటీసీని వేధించి తప్పుడు కేసులు పెడితే సెల్ఫీ వీడియో తీసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. పల్నాడులో ముగ్గురాయి వ్యాపారం కోసం వైసీపీ నేతలు బహిరంగంగా ఘర్షణలకు దిగారు. మనసున్నవారు వైసీపీలో ఉండేందుకు ఇష్టపడట్లేదు. ఉయ్యూరులో వైసీపీ జెడ్పీటీసీ పూర్ణిమ గౌరవప్రద మహిళగా ఉండలేనంటూ పదవికి రాజీనామా చేశారు. అనంతపురంలో ద్రాక్షతోటలో పనిచేసేందుకు వచ్చిన ముగ్గురు కూలీలు ప్రభుత్వ మద్యం దుకాణంలో కొన్న నాసిరకం మద్యం తాగి చనిపోయారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ఆ పార్టీ నేతలే తట్టుకోలేక పార్టీ వీడి టీడీపీలో చేరుతున్నారు.’’ అని పేర్కొన్నారు.
టీడీపీలో చేరిన వైసీపీ నాయకుడు గోవర్దన్ రెడ్డి
వైసీపీ నాయకుడు గుదిబండ గోవర్దన్ రెడ్డి, అతని అనుచరులు టీడీపీలో చేరారు. దుగ్గిరాల మాజీ ఎమ్మెల్యే గుదిబండ వెంకటరెడ్డి సోదరుడి కుమారుడైన గోవర్దన్ రెడ్డి తన అనుచరులతో ఎన్టీఆర్ భవన్కు వచ్చారు. ఈ సందర్భంగా గోవర్దన్ రెడ్డి మాట్లాడుతూ.. మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదనే భావన అన్ని వర్గాల ప్రజల్లో ఉందన్నారు. ప్రభుత్వం తరఫున రైతు సమస్యలు పట్టించుకునే వారే కరవయ్యారని విమర్శించారు. ఒక ఆశయం కోసమే తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని చెప్పారు.