అభివృద్ధి పనులను వేగవంతం చేయండి
ABN , First Publish Date - 2022-12-15T00:54:12+05:30 IST
ఆసుపత్రిలో అభివృద్ధి పనులను వేగవంతంగా జరిగేలా చూడాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సిబ్బందిని ఆదేశించారు.
సత్తెనపల్లి, డిసెంబరు 14: ఆసుపత్రిలో అభివృద్ధి పనులను వేగవంతంగా జరిగేలా చూడాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఏరియా వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న అభివృద్ధి కమిటీ సభ్యుడు కొత్త రామకృష్ణ మాట్లాడుతూ ఆసుపత్రిలో డ్రెయినేజ్ సిస్టమ్‌ను పూర్తిగా మార్చి అవసరమైన చోట కొత్తలైన్లు వేయాలని మంత్రిని కోరారు. సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు. కొత్తగా ఫ్యామిలీ మెడిసన్ సీటు కోసం నగదు విడుదల చేయాలని నిర్ణయించారు. ఆపరేషన్ థియేటర్‌లో వివిధ రకాలైన మరమ్మతులు చేపట్టాలని తీర్మానించారు. ఈ నెల 21న మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
సమావేశంలో ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట్రావు, ఆర్‌ఎంవో శోభారాణి, డాక్టర్లు గిరిజ, రాజమోహన్‌రెడ్డి, మెగా పాటు పార్టీ అనుబంధ సంఘాలు, వార్డు, యూనిక్ కమిటీ, బూత్ కన్వీనర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు.