పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్రలు

ABN , First Publish Date - 2022-10-11T05:30:00+05:30 IST

మూడు రాజధానుల ప్రతిపాదనతో ప్రాంతాల మధ్య విబేధాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని రాజధాని అమరావతికి 33వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులు పేర్కొన్నారు.

పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్రలు
బిల్డ్‌ అమరావతి అంటూ వెలగపూడి శిబిరంలో నినాదాలు చేస్తున్న రైతులు

1029 వ రోజుకు రైతుల ఆందోళలను

తుళ్లూరు, అక్టోబరు 11: మూడు రాజధానుల ప్రతిపాదనతో ప్రాంతాల మధ్య విబేధాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని రాజధాని అమరావతికి 33వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులు పేర్కొన్నారు. బిల్డ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ రైతులు, రైతు కూలీలు చేస్తున్న ఆందోళనలు మంగళవారం 1029వ రోజుకు చేరుకున్నాయి ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ అమరావతి టు అరసవల్లి మహాపాదయాత్రను అడ్డుకోవటానికి మంత్రులు, ఎమ్మెల్యేలు చేయని ప్రయత్నం లేదన్నారు. హైకోర్టు అనుమతితో శాంతియుతంగా పాదయాత్ర  చేస్తుంటే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నీ వర్గాల ప్రజలు రాజధానికి భూములిస్తే అమరావతిపై కూడా కులముద్ర వేశారన్నారు. ఇంత దిగజారుడు రాజకీయాలు తగదన్నారు. హైకోర్టు తీర్పు అమలు చేసి తప్పును సరిదిద్దుకోవాలన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. బిల్డ్‌ అమరావతి అంటూ దీపాలు వెలిగించి నినాదాలు చేశారు. 


Updated Date - 2022-10-11T05:30:00+05:30 IST