హైకోర్టు తీర్పును అమలు చేయాలి

ABN , First Publish Date - 2022-08-07T05:20:31+05:30 IST

రాష్ట్ర రాజధాని అమరావతి కోసం జీవనాధారమైన భూములిస్తే అభివృద్ధి చేయకుండా పాలకులు అన్యాయం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

హైకోర్టు తీర్పును అమలు చేయాలి
బిల్డ్‌ అమారావతి అంటూ తుళ్లూరు శిబిరంలో నినాదాలు చేస్తున్న మహిళలు

963వ రోజుకు చేరుకున్న రైతుల ఆందోళనలు

తుళ్లూరు, ఆగస్టు 6: రాష్ట్ర రాజధాని అమరావతి కోసం జీవనాధారమైన భూములిస్తే అభివృద్ధి చేయకుండా పాలకులు అన్యాయం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బిల్డ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌, హైకోర్టు తీర్పును అమలు చేయాలని రైతులు, మహిళలు, రైతు కూలీలు చే స్తున్న ఆందోళనలు శనివారం నాటికి 963వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగిన దాదాపు రూ.పదివేల కోట్ల అభివృద్ధి తప్ప, ఈ ప్రభుత్వంలో తట్ట మట్టి కూడా వేయకుండా కక్ష కట్టారన్నారు. రాగ ధ్వేషాలకు అతీతంగా అన్నీ వర్గాల ప్రజలకు న్యాయం చేస్తామని ప్రమాణ స్వీకారం చేసిన సీఎం జగన్‌రెడ్డి అమరావతి రైతులను పూర్తిగా అన్యాయం చేశారన్నారు.  రైతులకు అన్యాయం చేయవద్దని కోర్టు పలుమార్లు మొట్టికాయలు వేసినా ప్రభుత్వానికి చలనం లేదన్నారు. ఇప్పటికైనా హైకోర్టు తీర్పును అమలు పరిచి అభివృద్ధిని కొనసాగించాలన్నారు. బిల్డ్‌ అమరావతి అంటూ దీపాలు వెలిగించి అమరావతి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. రాజధాని 29 గ్రామాలలో ఆందోళనలు కొనసాగాయి. 

  

Updated Date - 2022-08-07T05:20:31+05:30 IST