అమరావతి రాష్ట్ర ఆదాయ వనరు

ABN , First Publish Date - 2022-08-05T04:59:04+05:30 IST

ప్రజా రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తామంటేనే చట్టబద్ధంగా భూములిచ్చామని, ఆ చట్టాన్ని కాదని సీఎం జగన్‌రెడ్డి అవరావతిని నిర్వీర్యం చేశారన్నారు.

అమరావతి రాష్ట్ర ఆదాయ వనరు
బిల్డ్‌ అమరావతి అంటూ నెక్కల్లు శిబిరంలో నినాదాలు చేస్తున్న రైతులు, మహిళలు

961వ రోజుకు రైతుల ఆందోళనలు 

తుళ్లూరు, ఆగస్టు 4: ప్రజా రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తామంటేనే చట్టబద్ధంగా భూములిచ్చామని, ఆ చట్టాన్ని కాదని సీఎం జగన్‌రెడ్డి అవరావతిని నిర్వీర్యం చేశారన్నారు. బిల్డ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు గురువారం 961వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా, దీక్షా శిబిరాల నుంచి మాట్లాడుతూ అమరావతిని అభివృద్ధి చేసినట్లయితే, రాష్ట్ర ఆదాయ వనరుగా ఉండి, అన్నీ ప్రాంతాల ప్రగతి చెందేవన్నారు. తెలంగాణకు హైదరాబాద్‌ ఎలా ఆదాయం సమకూర్చుతుందో అంతకంటే మిగులుగా అమరావతి ఆంధ్రప్రదేశ్‌కు రెవెన్యూ అందించేదన్నారు. కాని సీఎం జగన్‌రెడ్డి పొరుగు రాష్ట్రం బాగుకోసం అమరావతిని నాశనం చేశారని ఆరోపించారు. రాజకీయాల కోసం, సొంత ప్రయోజనాల కోసం అమరావతిని పాడు చేస్తున్నారన్నారు. హైకోర్టు తీర్పుతోనైనా తప్పు తెలుసుకుంటారని ఆశించామన్నారు. అదీ చేయటం లేదన్నారు. బిల్డ్‌ అమరావతి సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ దీపాలు వెలిగించి అమరావతి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. రాజధాని 29 గ్రామాల్లో ఆందోళనలు కొనసాగాయి. 


Updated Date - 2022-08-05T04:59:04+05:30 IST