-
-
Home » Andhra Pradesh » Guntur » alapati rajendraprasad-NGTS-AndhraPradesh
-
సంక్షేమం పేర కాలయాపన చేస్తున్న జగన్
ABN , First Publish Date - 2022-09-19T05:51:35+05:30 IST
సంక్షేమం, సామాజిక న్యాయం పేరు చెప్పి సీఎం జగన్‌రెడ్డి వెళ్లబుచ్చుతూ ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు.

మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్
గుంటూరు, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): సంక్షేమం, సామాజిక న్యాయం పేరు చెప్పి సీఎం జగన్‌రెడ్డి వెళ్లబుచ్చుతూ ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. ఆదివారం స్థానిక టీడీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశలవారి మద్య నియంత్రణ, అనంతరం మద్యనిషేధమని చెప్పి సీఎంజగన్ ఆడపడుచులను నయ వంచన చేశారని విమర్శించారు. ఎన్నికలకు ముందు మద్య నిషేధంపై జగన ఏం చెప్పారో.. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచిన తర్వాత ఏం చేస్తున్నారో ప్రజలకు అర్ధమవుతూనే ఉందన్నారు. దశలవారీ మద్య నిషేధమని మ్యానిఫెస్టోలో చెప్పి మద్యాన్ని ఏరులా పారిస్తూ రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశగా మార్చిన ఘనత సీఎం జగన్‌రెడ్డికే దక్కు తుందన్నారు. ఉపాధ్యాయలును కాపలాగా పెట్టి మద్యం అమ్మించిన జగనరెడ్డి ఉపాధ్యాయ లోకాన్ని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సంవత్సరం కంటే ఈఏడాది మద్యం ఆదాయం రూ.9000 కోట్ల నుంచి రూ.18,000 కోట్లకు పెరిగిందంటే రాష్ట్రంలో మద్యం ఏ రకంగా ఏరులై పారుతుందో ప్రజలు గమనించాలనికోరారు. కమీషన్లకు కక్కుర్తిపడి జే బ్రాండ్ల కల్తీ మద్యాన్ని అధిక రేట్లకు అమ్ముతూ పచ్చని కుటుంబాలను సీఎం జగన్ నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలు, పెట్టుబడులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయ్సా ల్సిన ముఖ్యమంత్రి ప్రజల రక్ష్తం పీల్చి మద్యంపై ఆదాయం పెంచుతు న్నాడని విమర్శించారు. కాగ్ అడిగిన లెక్కలకు ఇప్పటికీ సమాధానం లేదని, దొంగలెక్కలతో మరోమారు జగన్ జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు మాట్లా డుతూ మోసపూరిత హామీల ద్వారా అధికారంలోకి వచ్చిన వైసీపీ నేడు రాష్ట్రంలో అరాచకపాలన చేస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో చిట్టిబాబు, శివరామయ్య, బొర్రు రామారావు, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.