8, 9 తేదీల్లో పొన్నూరుకు చంద్రబాబు

ABN , First Publish Date - 2022-12-07T01:04:06+05:30 IST

మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో ప్రభుత్వ వైఫల్యాలపై ఇదేం కర్మ రాష్ట్రానికి పేరుతో పొన్నూరులో 8చ 9 తేదీల్లో చంద్రబాబు పర్యటిస్తార

8, 9 తేదీల్లో పొన్నూరుకు చంద్రబాబు
సమావేశంలో మాట్లాడుతున్న ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌

ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌

పొన్నూరు టౌన్‌, డిసెంబరు 6: మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో ప్రభుత్వ వైఫల్యాలపై ఇదేం కర్మ రాష్ట్రానికి పేరుతో పొన్నూరులో 8చ 9 తేదీల్లో చంద్రబాబు పర్యటిస్తారని మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ తెలిపారు. మంగళవారం స్థానిక నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 8న నారాకోడూరు నుంచి చేబ్రోలు మీదగా పొన్నూరుకి చంద్రబాబు వస్తారని, సాయంత్రం పట్టణంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వివరించారు. 8న రాత్రి పరంథయ్య కన్వెన్షన్‌ సెంటర్‌లో చంద్రబాబు బస ఏర్పాటు చేశామన్నారు. 9న ఉదయం మైనార్టీ సమస్యలపై సదస్సు జరుగుతుందన్నారు. మూడున్నరేళ్లలో పొన్నూరులో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ప్రజలను చైతన్యం చేయడమే ఈ పర్యటన లక్ష్యమన్నారు. మైనింగ్‌, రేషన్‌ అక్రమాలకు పొన్నూరు కేరాఫ్‌గా మారిందన్నారు. స్థానిక శాసనసభ్యుడు కిలారి వెంకటరోశయ్యే ఈ అక్రమాలకు కేంద్ర బిందువుగా ఉన్నారని ఆరోపించారు. ఈ సభ ద్వారా పొన్నూరు నియోజకవర్గంలో ఆగిన అభివృద్ధి, అక్రమాలను ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు. మైనారిటీల సదస్సులో ఆగిన ఇమామ్‌లు, మౌజన్ల వేతనాలు, షాదీ తోఫా, విదేశీ విద్య, షాదీఖానాల నిర్మాణాలపై చర్చించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమాలకు ప్రజానీకం పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాల్సిందిగా తెలిపారు. తక్కెళ్లపాడులో వైద్య విద్యార్థిని తపస్వి హత్యాకాండను తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ఈ సంఘటన నిదర్శనంగా మారుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మహిళల రక్షణకు కంటి తుడుపు చర్యలు కాకుండా కఠినంగా వ్యవహరించాలని నరేంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-12-07T01:04:11+05:30 IST