యువత సమస్యలు తెలుసుకునేందుకు యువగళం పాదయాత్ర

ABN , First Publish Date - 2022-12-31T01:17:12+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా యువత ఎదుర్కొంటున్న మస్యలను తెలుసుకోవడానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రను చేపట్టనున్నారని పార్టీ నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు కంఠమణి రామకృష్ణారావు, జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి తెలిపారు.

యువత సమస్యలు తెలుసుకునేందుకు యువగళం పాదయాత్ర

కొవ్వూరు, డిసెంబరు 30: రాష్ట్ర వ్యాప్తంగా యువత ఎదుర్కొంటున్న మస్యలను తెలుసుకోవడానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రను చేపట్టనున్నారని పార్టీ నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు కంఠమణి రామకృష్ణారావు, జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి తెలిపారు. శుక్రవారం కొవ్వూరు పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలోవారు మాట్లాడుతూ జనవరి 27న కుప్పం నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర 400 రోజులు, 4వేల కిలోమీటర్లు, 100 నియోజకవర్గాల్లో పర్యటించి ఇచ్చాపురం చేరుకుంటుందన్నారు. ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి యువతకు ఉపాధి కల్పిస్తానని చెప్పిన జగన్‌రెడ్డి మాటతప్పారని, దీంతో రాష్ట్రంలో ఉపాధి కరువై యువత నిరుద్యోగులుగా మిగిలిపోయారన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పి జె బ్రాండ్ల పేరుతో మద్యాన్ని ఏరులై పారేలా చేశారన్నారు. కార్యక్రమంలో అర్బన్‌బ్యాంకు చైర్మన్‌ మద్దిపట్ల శివరామకృష్ణ, సూరపనేని చిన్ని, దాయన రామకృష్ణ, వట్టికూటి వెంకటేశ్వరరావు, తోరం నగేష్‌, సూర్యదేవర రంజిత్‌, మద్దుల సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T01:18:01+05:30 IST