ఉప్పొంగుతున్న ఎర్రకాలువ

ABN , First Publish Date - 2022-08-10T06:24:17+05:30 IST

ఎర్రకాలువ ఉప్పొంగి ప్రవహిస్తోంది.

ఉప్పొంగుతున్న ఎర్రకాలువ

నిడదవోలు, ఆగస్టు 9 : ఎర్రకాలువ ఉప్పొంగి ప్రవహిస్తోంది. గత కొద్దిరోజు లుగా కురుస్తున్న వర్షాలకు కొంగువారిగూడెం ఎర్ర కాలువ రిజర్వాయరు వద్దకు మంగళవారం 6613 క్యూసెక్కుల నీరు చేరగా మూడు గేట్లు ఎత్తి  3745 క్యూ సెక్కుల నీటిని దిగువకు విడుదలచేశారు.నిడదవోలు, నల్లజర్ల మండలాల్లోని పలు గ్రామాల్లోకి ఎర్రకాలువ వరదనీరు ప్రవేశించింది. శింగవరం, తాళ్ళపాలెం మధ్య ఉన్న రైల్వే అండర్‌బ్రిడ్జి వద్దకు నీరు చేరింది. తహశీల్దార్‌ ఎం.గంగరాజు ఎర్రకాలువ వరద నీటిని ఎప్పటికప్పుడు పరిశీలించారు. ఎర్రకాలువ ఉధృతంగా ఉన్నందున పరీ వాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 


Read more