వైసీపీ నేతపై కేసు నమోదు

ABN , First Publish Date - 2022-12-15T00:18:00+05:30 IST

ద్రాక్షారామ పైండా వెంకన్న రామకృష్ణయ్య అన్నదాన సత్రం భూములు కౌలు శిస్తు బకాయిలు చెల్లించమన్నందుకు సత్రం ఉద్యోగిపై బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామానికి చెందిన మాజీ డీసీఎంఎస్‌ డైరెక్టరు, వైసీపీ నాయకుడు పట్నాల గణపతిరావు దౌర్జన్యం చేయడంతో ద్రాక్షారామ పోలీసులు కేసు నమోదు చేశారు.

వైసీపీ నేతపై కేసు నమోదు

ద్రాక్షారామ, డిసెంబరు 14: ద్రాక్షారామ పైండా వెంకన్న రామకృష్ణయ్య అన్నదాన సత్రం భూములు కౌలు శిస్తు బకాయిలు చెల్లించమన్నందుకు సత్రం ఉద్యోగిపై బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామానికి చెందిన మాజీ డీసీఎంఎస్‌ డైరెక్టరు, వైసీపీ నాయకుడు పట్నాల గణపతిరావు దౌర్జన్యం చేయడంతో ద్రాక్షారామ పోలీసులు కేసు నమోదు చేశారు. ద్రాక్షారామలో భక్తులకు నిత్యాన్నదానం జరిపే పైండా వెంకన్న రామకృష్ణయ్య అన్నదానం సత్రానికి చెందిన 14.63 ఎకరాల భూమి వెల్ల గ్రామానికి చెందిన పట్నాల గణపతిరావు సబ్‌ లీజుకు తీసుకున్నాడు. ఎకరానికి రూ.22 వేలు చొప్పున 14.63 ఎకరాలకు ఏడాదికి కౌలు రూ.3,21,860 చొప్పున 2018-19 నుంచి 2021-22 వరకు రూ.9,65,580 చెల్లించాల్సి ఉందని సమాచారం. వెల్ల సోమేశ్వరస్వామివారి దేవస్థానానికి చెందిన 3.66 ఎకరాలకు రూ.2.21 లక్షలు, కాకినాడ ఎంఎస్‌ఎన్‌ చార్టీస్‌కు చెందిన 3.82 ఎకరాలకు రూ.1.18లక్షలు చెల్లించాల్సి ఉందని సమాచారం. కౌలు బకాయిలు చెల్లించాలని 2019 నుంచి సిబ్బంది ఎన్నిసార్లు ఫోన్‌ చేసిన సమాధానం చెప్పడం లేదు. ఈనేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు పట్నాల గణపతిరావును పైండా సత్రం జూనియర్‌ అసిస్టెంట్‌ ఆరాద్యులు రామకృష్ణ బకాయిలు గురించి అడిగారు. దీంతో దుర్భాషలాడి, కాలర్‌ పట్టుకుని, తోసి మీకు ఎటువంటి బకాయిలు ఇవ్వాల్సిన అవసరం లేదని, చంపుతానని గణపతిరావు బెదిరించాడని ఆరాద్యుల రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వి.వినోద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-12-15T00:18:01+05:30 IST