వైసీపీ పాలనలో ‘ఆర్టీసీకి ఇదేం ఖర్మ’

ABN , First Publish Date - 2022-12-07T01:45:14+05:30 IST

వైసీపీ పాలనలో ఆర్టీసీకీ ఇదేం దుస్థితి, ఇదేం ఖర్మ అంటూ తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి వినూత్నంగా మంగళవారం నిరసన తెలియజేశారు.

వైసీపీ పాలనలో ‘ఆర్టీసీకి ఇదేం ఖర్మ’
ఆర్టీసీ డ్రైవర్‌ను సత్కరిస్తున్న ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి

గతులకుల రోడ్లలో బస్సులు నడుపుతున్న డ్రైవర్లకు ఎమ్మెల్యే గోరంట్ల సత్కారం

రాజమహేంద్రవరం అర్బన్‌, డిసెంబరు 6: వైసీపీ పాలనలో ఆర్టీసీకీ ఇదేం దుస్థితి, ఇదేం ఖర్మ అంటూ తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి వినూత్నంగా మంగళవారం నిరసన తెలియజేశారు. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నప్పటికీ బస్సులు ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా నడుపుతున్న పలువురు ఆర్టీసీ డ్రైవర్లను ఎమ్మెల్యే గోరంట్ల సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తుగ్లక్‌ పరిపాలన చూసి రాష్ట్ర ప్రజలు ఇదేం ఖర్మరా బాబూ అనుకుంటున్నారని అన్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలు అభివృద్ధిలో వెనుకబడ్డాయని, మరీ ముఖ్యంగా రోడ్ల దుస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. ప్రభుత్వ వైఖరి కారణంగా ఆర్టీసీ వ్యవస్థ మొత్తం చతికిలపడిందని, పాత బస్సులకు అతుకులు పెట్టుకుని నడిపిస్తున్నారని విమర్శించారు. డ్రైవర్లకు సన్మానం చేయడానికి ప్రత్యేక కార ణం ఉందని, రాష్ట్రంలో రోడ్లు ఎంత అధ్వానంగా ఉ న్నా డ్రైవర్లు ధైర్యంగా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని చోట్ల గోతులు పడిన రోడ్లను బాగు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రూరల్‌ మండల టీడీపీ అధ్యక్షుడు ప్రసాద్‌, పండూరి అప్పారావు, చెల్లుబోయిన శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T01:45:36+05:30 IST