వైసీపీ దోపిడీ పాలనకు చరమగీతం పాడాలి

ABN , First Publish Date - 2022-12-13T00:48:21+05:30 IST

వ్యవస్థలన్నింటినీ అస్త వ్యస్తం చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని టీడీపీ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి అయితాబత్తుల ఆనందరావు విమర్శించారు.

 వైసీపీ దోపిడీ పాలనకు చరమగీతం పాడాలి

అమలాపురం టౌన్‌, డిసెంబరు 12: వ్యవస్థలన్నింటినీ అస్త వ్యస్తం చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని టీడీపీ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి అయితాబత్తుల ఆనందరావు విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ దోపిడీ పాలనకు, అరాచకాలకు చరమగీతం పాడే సమయం అసన్నమవుతోందన్నారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్ర మాన్ని సోమవారం పట్టణపరిధిలోని 13,14వార్డుల్లో నిర్వహిం చారు. తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయ లక్ష్మి ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం ద్వారానే రాష్ట్రం అభివృద్ధి బాట పడుతుందని సూచించారు. నాయ కులు కర్రి దత్తుడు, తిక్కిరెడ్డి నేతాజీ, నల్లా స్వామి, అల్లాడ సోంబాబు, గెద్దాడ సత్యవాణి, పరమట శ్యామ్‌ కుమార్‌, బత్తుల సాయి, కాశిన జయనాథ్‌, బషీర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T00:48:21+05:30 IST

Read more