మహిళల ఇబ్బందులు తెలుసుకొనేందుకే ‘మాటా మంతి ’

ABN , First Publish Date - 2022-11-21T01:02:14+05:30 IST

వైసీపీ పాలనలో మహిళలు పడుతున్న ఇబ్బం దులను ప్రతి మహిళ తెలుసుకోవాలన్న సంకల్పంతో టీడీపీ అధినేత చంద్ర బాబు మాటా మంతి కార్యక్రమం ఏర్పాటు చేశారని జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి అన్నారు. ఆదివారం అనపర్తిలోని పార్టీ కార్యా లయంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగు మహిళా నేతలు మాటా మంతి పోస్టర్‌ను ఆవిష్కరించారు.

మహిళల ఇబ్బందులు తెలుసుకొనేందుకే ‘మాటా మంతి ’

అనపర్తి, నవంబరు 20: వైసీపీ పాలనలో మహిళలు పడుతున్న ఇబ్బం దులను ప్రతి మహిళ తెలుసుకోవాలన్న సంకల్పంతో టీడీపీ అధినేత చంద్ర బాబు మాటా మంతి కార్యక్రమం ఏర్పాటు చేశారని జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి అన్నారు. ఆదివారం అనపర్తిలోని పార్టీ కార్యా లయంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగు మహిళా నేతలు మాటా మంతి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో విజయలక్ష్మి మాట్లాడుతూ వైసీపీ పాలనలో చిన్నారుల నుంచి మహిళల వరకు రక్షణ లేకుండా పోయిందని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారన్నారు. తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి మాట్లాడుతూ మహిళా ఓటు బ్యాంకుతో అధికారంలోకి వచ్చిన జగన్మోహనరెడ్డి మహిళల రక్షణ మరిచారన్నారు. మద్యపాన నిషేదం అని చెప్పి రాష్ట్రాన్ని మధ్యాంద్రప్రదేశ్‌గా మార్చారన్నారు. చంద్రబాబుతోనే రామరాజ్యం సాధ్యమన్నారు. ముందుగా తెలుగు మహిళా కమిటీ ప్రతినిధులు మాటా మంతి పోస్టర్‌లను ఆవిష్కరించి జిల్లాలోనే ఈ కార్యక్రమాన్ని అనపర్తి నుంచి ప్రారంభించారు. కార్యక్రమంలో బేరా వేణమ్మ, చంద్రమళ్ల సుభాషిణి, వనుం మల్లేశ్వరి, ఒంటిమి గౌతమి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-21T01:02:14+05:30 IST

Read more