చున్నీకి నిప్పంటుకుని గిరిజన మహిళ మృతి

ABN , First Publish Date - 2022-03-05T05:33:24+05:30 IST

చున్నీకి నిప్పంటుకుని గురువారం ఓ గిరిజన మహిళ మృతి చెం దింది.

చున్నీకి నిప్పంటుకుని గిరిజన మహిళ మృతి

రాజవొమ్మంగి, మార్చి 4: చున్నీకి నిప్పంటుకుని గురువారం ఓ గిరిజన మహిళ మృతి చెం దింది. లోదొడ్డి పంచాయతీ కేశవరం గ్రామానికి చెందిన ముర్ల అరుణశ్రీ(22) ఇంటివద్ద పొయ్యి మీద వంట చేస్తుండగా చున్నీకి మంటలు అంటు కోవడంతో స్థానికులు మంటలు ఆర్పారు. అప్పటికే చాలావరకు కాలిపోవడంతో అదే గ్రామంలో ఉన్న ఆమె తల్లికి చెప్పగా కుటుంబీకులు జడ్డంగి ప్రభు త్వాస్పత్రికి తరలిచారు. జడ్డంగి వైద్యాధికారి సుజి చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఏలేశ్వరం రిఫర్‌ చేశారు. ఏలేశ్వరం వెళ్లే మార్గమధ్యలో చనిపోయినట్టు మృతురాలి తల్లి లోత గౌరమ్మ తెలిపినట్టు జడ్డంగి ఎస్‌ఐ కె.షరిఫ్‌ తెలిపారు. దీనిపై కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. అరుణశ్రీకి నాలుగేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన చిన్నబ్బాయితో వివాహం కాగా వారికి నాలుగేళ్ల పాప ఉంది. ఆమె లోదొడ్డి సర్పంచ్‌ లోత రామరావు సోదరి కావడంతో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి.

Read more