కార్మికుల పని తీరుతోనే ఆర్టీసీ ప్రగతి

ABN , First Publish Date - 2022-04-24T06:56:50+05:30 IST

ఉద్యోగులు, కార్మికుల మెరుగైన పనితీరుతోనే ఆర్టీసీ ప్రగతి ఆధారపడి ఉందని విజ యవాడ జోన్‌-2 ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గిడుగు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.

కార్మికుల పని తీరుతోనే ఆర్టీసీ ప్రగతి

అమలాపురం టౌన్‌, ఏప్రిల్‌ 23:  ఉద్యోగులు, కార్మికుల మెరుగైన పనితీరుతోనే ఆర్టీసీ ప్రగతి ఆధారపడి ఉందని విజ యవాడ జోన్‌-2 ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గిడుగు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.  విజయనగరం జోన్‌ పరిధిలో ఉన్న అమలాపురం ఆర్టీసీ డిపో జిల్లాల పునర్విభజనలో భాగంగా  విజయవాడ జోన్‌-2 పరిధిలోకి మార్చడం జరిగిందన్నారు. శనివారం ఆకస్మికంగా అమలాపురం ఆర్టీసీ డిపోను తనిఖీ చేశారు. డిపోలోని పలు విభాగాలను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆర్వోప్లాంటును ఏర్పాటుచేసిన లయన్స్‌క్లబ్‌ వశిష్ఠ ప్రతినిధులను అభినందించారు. ఆర్టీసీ కాంప్లెక్సు ప్రాంగణంలో ఆయన మొక్కలు నాటారు.  Read more