నేత కార్మికుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
ABN , First Publish Date - 2022-08-08T06:02:26+05:30 IST
చేనేతలు సమాజంలో ఆర్థికం, సామాజికం అభివృద్ధి సాధించే విధంగా ముందుకు సాగాలని, వారి అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు.

- ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి
- పలుచోట్ల చేనేత కార్మికులకు సత్కారం
అనపర్తి, ఆగస్టు 7: చేనేతలు సమాజంలో ఆర్థికం, సామాజికం అభివృద్ధి సాధించే విధంగా ముందుకు సాగాలని, వారి అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పలుచోట్ల ఆదివారం నిర్వహించారు. అనపర్తిలోని బావనారుషి ఆలయ ప్రాంగణంలో పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి చేనేత జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనపర్తి లో పద్మశాలి వర్గం నుంచి ప్రజా ప్రతినిధులుగా సేవలందిస్తున్న ఎంపీటీ సీలు, వార్డు సభ్యులను సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యేను సంఘ సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ వారా కుమారి, జెడ్పీటీసీ సత్తి గీతావరలక్ష్మి, ఎంపీపీ అంసూరి సూర్యనారాయణ, రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి, పంపన రామకృష్ణ, ఆంజనేయ గురుస్వామి, పెనుగొండ శ్రీనివాసరావు పాల్గొన్నారు.